seetimaarr: జ్వాలారెడ్డి @10 మిలియన్‌ - seetimaarr movie song jwalareddy 10 million views
close
Published : 05/05/2021 15:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

seetimaarr: జ్వాలారెడ్డి @10 మిలియన్‌

ఇంటర్నెట్‌ డెస్క్: యాక్షన్‌ చిత్రాల హీరో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘సీటీమార్‌’. సంపత్‌ నంది దర్శకత్వంలో క్రీడా నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. సినిమాకి సంబంధించి విడుదలైన ‘జ్వాలారెడ్డి’ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఈ పాట 10 మిలియన్ల వ్యూస్‌ దాటేసింది. అంతేకాదు,  100కె లైక్స్‌ను సాధించింది. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా శంకర్‌బాబు, మంగ్లీ ఆలపించారు. మణిశర్మ సంగీత స్వరాలు సమకూర్చారు. చిత్రంలో గోపీచంద్‌ ఆంధ్రా కబడ్డీ కోచ్‌గా తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్‌ జ్వాలారెడ్డిగా కనిపించనుంది. దిగంగన సూర్యవంశీ మరో కథానాయిక. భూమిక ప్రధాన పాత్రలో నటిస్తోంది. పవన్‌ కుమార్‌ సమర్పణలో సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రానికి శ్రీనివాసా చిట్టూరి నిర్మాత.  ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా కరోనా కారణంగా వాయిదా పడింది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని