close
Published : 16/04/2021 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆకట్టుకునేలా ‘సెహరి’ టీజర్‌

హైదరాబాద్‌: ‘లైఫ్‌లో నెక్స్ట్‌ ఫేజ్‌లోకి ఎంటరవ్వాలని సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నా’ అని అంటున్నారు హర్ష్‌ కనుమిల్లి. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ టీజర్‌లో హర్ష్‌ డైలాగ్‌లు, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో హర్ష్‌కు జంటగా సిమ్రాన్‌ చౌదరి కనిపించనున్నారు. అభినవ్‌, ప్రణీత్‌ రెడ్డి కీలకపాత్రలు పోషించారు. జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలు. ప్రశాంత్‌ ఆర్‌.విహరి స్వరాలు అందిస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని