Tollywood: అల‌రిస్తోన్న ‘సెహరి’ టైటిల్ సాంగ్  - sehari title song
close
Published : 07/06/2021 15:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: అల‌రిస్తోన్న ‘సెహరి’ టైటిల్ సాంగ్ 

ఇంట‌ర్నెట్ డెస్క్‌: హ‌ర్ష్ క‌నుమిల్లి హీరోగా ద‌ర్శ‌కుడు జ్ఞానసాగ‌ర్ ద్వార‌క తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘సెహరి’. సిమ్ర‌న్ చౌద‌రి నాయిక‌. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా టైటిల్ గీతాన్ని తాజాగా విడుద‌ల చేసింది చిత్ర బృందం. భాస్క‌రభ‌ట్ల ర‌వికుమార్ సాహిత్యం అందించిన ఈ పాట‌ని రామ్ మిర్యాల ఆల‌పించారు. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందించారు. హుషారుగా సాగుతూ అన్ని వ‌ర్గాల శ్రోత‌ల్ని ఆక‌ట్టుకునేలా ఉంది ఈ గీతం. య‌శ్ మాస్ట‌ర్ నేతృత్వంలో ఈ పాట‌ని చిత్రీక‌రించారు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న‌ ఈ చిత్రంలో అభినవ్‌, ప్రణీత్‌ రెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు. జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని