శంక‌ర్ పిక్చ‌ర్స్ చేతుల్లోకి ‘ఎస్ఆర్ క‌ల్యాణ‌మండ‌పం’..  - shankar pictures bagged sr kalyana mandapam movie rights starred kiran abbavaram priyanka jawalkar
close
Published : 14/06/2021 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శంక‌ర్ పిక్చ‌ర్స్ చేతుల్లోకి ‘ఎస్ఆర్ క‌ల్యాణ‌మండ‌పం’.. 

ఇంట‌ర్నెట్ డెస్క్‌: పాట‌ల‌తోనే కొన్ని చిత్రాలు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని పెంచుతాయి. అలాంటి ఓ చిత్ర‌మే ‘ఎస్.ఆర్‌.క‌ల్యాణ‌మండ‌పం’. ‘రాజావారు రాణీవారు’ చిత్రంతో ఆక‌ట్టుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా శ్రీధ‌ర్ గాదె తెర‌కెక్కిస్తున్నారు. ప్రియాంక జ‌వాల్క‌ర్ నాయిక‌. సాయి కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచుతున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించే (థియేట‌ర్‌) హ‌క్కుల్ని శంక‌ర్ పిక్చ‌ర్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఈ విష‌యాన్ని పంచుకుంది చిత్ర బృందం. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చైత‌న్య భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న‌ ఈ చిత్రం కరోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని