Bigg Boss Telugu5: షణ్ముఖ్‌ బర్త్‌డే.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దీప్తి సునయన! - shanmukh gets a pleasant birthday surprise in bigg boss house
close
Updated : 18/09/2021 18:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu5: షణ్ముఖ్‌ బర్త్‌డే.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దీప్తి సునయన!

హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా తెలుగులో ప్రసారమవుతున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్ సీజన్‌5‌’. రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ షోలో హౌస్‌మేట్స్‌ మధ్య పోరు హోరాహోరీగానే సాగుతోంది. ముఖ్యంగా టాస్క్‌ల్లో ‘నువ్వా నేనా’ అన్న రీతిలో పోటీ పడుతున్నారు. కాగా, గురువారం కాస్త ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ షణ్ముఖ్‌ పుట్టినరోజు సందర్భంగా హౌస్‌లో సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఈ సందర్భంగా హమీదా-షణ్ముఖలను రవి, శ్వేత ఆటపట్టించారు. రవి చేసిన వ్యాఖ్యలను హమీదా కూడా సరదాగా తీసుకుని ఛలోక్తులు విసిరింది. ఇక షణ్ముఖ్‌ పుట్టిన రోజు సందర్భంగా బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌, యూట్యూబ్‌ స్టార్‌ దీప్తి సునయన సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. టపాసులు పేల్చారు. అనంతరం హౌస్‌లో సెలబ్రేషన్స్‌ జరిగాయి.

బిగ్‌బాస్‌ షో గ్రాండ్‌ ఈవెంట్‌కు రేటింగ్‌ ఇలా..!

సెప్టెంబరు 5న ప్రసారమైన ‘బిగ్‌బాస్‌ సీజన్‌5’ ప్రారంభ ఈవెంట్‌కు సంబంధించిన రేటింగ్స్‌ విడుదలయ్యాయి. 15.71రేటింగ్‌తో ఈ ఎపిసోడ్‌ నిలిచింది. మొత్తం 19మంది సభ్యులు ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లగా, తొలి వారం సరయు ఎలిమినేట్‌ అయ్యారు. రెండో వారం నామినేషన్స్‌లో ఉమాదేవి, నటరాజ్‌, కాజల్‌, లోబో, ప్రియాంక, ప్రియ, అని మాస్టర్‌లు ఉన్నారు.






మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని