WWW: ఆసక్తిగా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ థీమ్‌ సాంగ్‌ - shivani rajasekhar adit arun new film www theme song out now kv guhan
close
Published : 02/07/2021 17:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WWW: ఆసక్తిగా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ థీమ్‌ సాంగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు, తమిళ భాషల్లో రానున్న తొలి కంప్యూటర్‌ స్ర్కీన్‌ చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు ఎక్కడ ఎందుకు). ‘118’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్న కె.వి. గుహన్‌ తెరకెక్కిస్తోన్న రెండో చిత్రమిది. అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ నాయకానాయికలుగా నటిస్తున్నారు. రవి ప్రసాద్‌ రాజు దాట్ల నిర్మాత. మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో రానున్న ఈ సినిమా థీమ్‌ సాంగ్‌ని శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం. కేవలం నేపథ్య సంగీతంతోనే ఈ వీడియో రూపొందింది. సైమన్‌ కె.కింగ్‌ అందించిన సంగీతం ఉత్కంఠగా సాగింది. నటీనటుల్ని నేరుగా పరిచయం చేయకుండా స్కెచ్‌ రూపంలో వాళ్లని చూపించారు. కథానాయకుడు, నటులు ప్రియదర్శి, సత్యం రాజేశ్‌ తదితరులు ఆన్‌లైన్‌ వేదికగా ముచ్చటించడం, హర్ష కిడ్నాప్‌ గురయ్యే సన్నివేశాలతో ఆసక్తిగా సాగింది ఈ వీడియో. మరి ఎక్కడ, ఎవరి మధ్య ఏం జరిగింది? ఎందుకు జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రామంత్ర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఆలస్యమెందుకు ఈ సినిమా కాన్సెప్ట్‌ని మీరూ చూసేయండి..




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని