శ్రద్ధ కొత్త చిత్రం - shraddha kapoor and rajkummar rao may reunite for jackky bhagnani next production
close
Published : 24/06/2021 10:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రద్ధ కొత్త చిత్రం

ముంబయి: గత ఏడాది ‘భాఘి 3’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రద్ధాకపూర్‌ ప్రస్తుతం లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు ‘ఛాల్‌బాజ్‌ ఇన్‌ లండన్‌’ చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా మరో కొత్త చిత్రానికి అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘జాకీ చిత్రాల్లో నటించడానికి కొన్ని రోజులుగా శ్రద్ధ, జాకీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఓ కథ సిద్ధమైంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది’’ అని జాకీ భగ్నానీ సన్నిహితులు చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌ రావ్‌ నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ముదాస్సార్‌ అజీజ్‌ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. వినోదాత్మకంగా సాగుతూనే ఓ చక్కటి సందేశం ఇందులో ఉంటుందని సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని