కృష్ణలాంటి వ్యక్తి అందరిలోనూ ఉంటాడు
close
Published : 16/07/2020 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కృష్ణలాంటి వ్యక్తి అందరిలోనూ ఉంటాడు

హైదరాబాద్‌: ‘‘మా సినిమాలో కనిపించే కృష్ణలాంటి వ్యక్తి అందరిలోనూ ఉంటాడు. అందుకే చూసిన ప్రతి ఒక్కరూ ఆ పాత్రలో ఎక్కడో తమని తాము చూసుకున్నాం అంటున్నారు. అదే మా సినిమా విజయానికి కారణం’’ అన్నారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ‘ఎల్‌.బి.డబ్ల్యు’, ‘గుంటూరు టాకీస్‌’ తదితర చిత్రాల్లో నటించిన గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఇటీవల ఓటీటీ వేదికలో విడుదలైన ‘కృష్ణ అండ్‌ హిస్‌ లీల’ చిత్రంలోనూ కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రానికి లభిస్తున్న ఆదరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు సిద్ధు.

‘‘అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకి కూడా ఎదురయ్యే అనుభవాలతో మా సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం విషయంలో అన్నిటికంటే అతి పెద్ద సవాల్‌ ఏదంటే... రచనే. చాలా సున్నితమైన కథ. కొంచెం అటూ ఇటూ అయినా ఇది తప్పు అనిపించే అవకాశం ఉంది’’

‘‘ఎక్కడో ఒక అబ్బాయి ఇద్దరమ్మాయిల్ని ప్రేమించడం కరెక్టే అని చెబుతున్నామనే అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. అందుకే సమతూకం పాటిస్తూ కథని ముందుకు నడిపించాం. దర్శకుడు రవికాంత్‌ పేరేపు, నేను కలిసి రాసిన కథ ఇది. రాబోయే సినిమా ‘మా వింత గాథ వినుమా’కి కూడా రచన, ఎడిటింగ్‌లో భాగం పంచుకుంటున్నా’’ అని చెప్పారు సిద్ధు.

మధుర శ్రీధర్‌ నిర్మాణంలో విమల్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాతోపాటు, కొత్తగా రెండు కథలు సిద్ధమయ్యాయన్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని