ప్రభాస్‌ ఎంట్రీ మామూలుగా ఉండదట..! - social media buzz on the intro scene of prabhas in salaar
close
Updated : 29/01/2021 11:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ ఎంట్రీ మామూలుగా ఉండదట..!

హైదరాబాద్‌: ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ స్థాయి ఒక్కసారిగా పెరిగింది. దర్శకులు సైతం ఆయనతో భారీ బడ్జెట్‌.. పాన్‌ ఇండియన్‌ మూవీలు తీసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలా ప్రభాస్‌ కథానాయకుడిగా రానున్న ఓ భారీ ప్రాజెక్ట్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌నీల్‌ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూట్‌ శుక్రవారం నుంచి గోదావరి ఖని బొగ్గు గనుల్లో ప్రారంభం కానుంది.

కాగా, ‘సలార్‌’కు సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అదేమిటంటే.. చిత్రబృందం ప్రభాస్‌ ఎంట్రీని గ్రాండ్‌ లెవల్‌లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఫైట్‌ సీక్వెన్స్‌తో రూపుదిద్దుకోనున్న ఈ ఒక్క సీన్‌ కోసమే భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. ఈ సినిమాలో మొత్తం ఆరు ఫైట్లు ఉన్నాయని, ప్రభాస్‌-శ్రుతిహాసన్‌ మధ్య తెరకెక్కే సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయని సినీ పరిశ్రమలో టాక్‌ వినిపిస్తోంది. ఈ మేరకు పలు పోస్టులు సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే ఈ కథనాలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చదవండి

స్టార్‌హీరో పెళ్లిపై నటి వైరల్‌ కామెంట్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని