RIP Vivek: హృదయం ముక్కలైంది..! - sorrowful condolences pour for actor vivek
close
Published : 17/04/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RIP Vivek: హృదయం ముక్కలైంది..!

హాస్యనటుడి మృతికి సినీ ప్రముఖుల సంతాపం

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అకాల మరణంతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వివేక్‌ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని వారు పేర్కొన్నారు.

హాస్యనటుడు వివేక్‌ అకాల మరణం చాలామందిలో విషాదం మిగిల్చింది. ఆయన కామెడీ టైమింగ్‌, డైలాగులు ప్రజలకు ఎంతో వినోదం పంచాయి. ఆయన తన సినిమాలతో పాటు నిజ జీవితంలోనూ పర్యావరణం, సమాజం కోసం పరితపించారు. ఆయన కటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి. - నరేంద్రమోదీ

జూనియర్ కలైవనార్, సామాజిక కార్యకర్త, నా సన్నిహితుడు వివేక్. ఆయన మరణం నాకు చాలా బాధ కలిగించింది. ‘శివాజీ’ తెరకెక్కిస్తున్న సమయంలో నేను అతనితో ఉన్న సమయాన్ని ఎప్పటికీ మరచిపోలేను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. - రజనీకాంత్‌

నా స్నేహితుడు వివేక్. ఆయన మరణం తమిళ సమాజానికి ఒక విపత్తులాంటిది.  -  కమల్‌హాసన్‌

నటుడు వివేక్‌గారు మరణించారనే ఈ దుర్వార్త హృదయ విదారకం. మీరు లేని లోటు తీర్చలేనిది. మీ ఆత్మకు శాంతి కలగాలి.   - వెంకటేశ్‌

మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధ కలిగించింది. మీ కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. వివేక్.  - రమ్యకృష్ణ

మిమ్మల్ని చూస్తూ పెరిగాను. మీ కామెడీ ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుండేవారు. మీరు ఒక అరుదైన రత్నం. ఎప్పటికీ గుర్తుంచుకుంటాం సర్‌.   -  రామ్‌ పోతినేని

వివేక్‌గారి మరణవార్త విస్మయానికి గురిచేసింది. గుండె బద్దలైంది. నా అభిమాన హాస్యనటుల్లో ఆయన ఒకరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.   - మంచు లక్ష్మి

నా అభిమాన హాస్యనటుడు ఇక మనతో లేరనే వార్త నమ్మలేకపోతున్నాను. దురదృష్టవశాత్తూ ఆయనతో నటించే అవకాశం నాకు రాలేదు. కానీ.. ఆయనతో మాట్లాడిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తన జీవితం మొత్తం ఇతరులను నవ్వించేందుకు త్యాగం చేశారు. ఎవరితోనూ సాధ్యంకాని విధంగా హాస్యంలోనూ మంచి సామాజిక సందేశాలు ఇచ్చారు. ఆయన ఒక సామాజిక వేత్త. తమిళసినిమాలో ఆయన లేనిలోటు పూడ్చలేనిది.  - కీర్తిసురేశ్‌

‘నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ - మోహన్‌లాల్‌

‘ప్రముఖ హాస్యనటుడు వివేక్ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు’ - సమంత

‘మీరు ఇకపై మా మధ్య ఉండరనే వార్తను నేను నమ్మలేకపోతున్నా. మిమ్మల్ని మేము ఎంతో మిస్‌ అవుతాం. మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు’ - హన్సిక

‘నా అభిమాన నటుడు, ఎవరి నుంచి అయితే నేను స్ఫూర్తి పొందానో అలాంటి గొప్ప వ్యక్తి ఇకలేరు అనే వార్త నన్ను ఎంతో కలచివేసింది. దేవుడు ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నా’ - శ్రీనువైట్ల

‘మాలో ఎన్నో మంచి ఆలోచనలు రేకెత్తించినందుకు, వైవిధ్యమైన నటనతో మమ్మల్ని మనసారా నవ్వించినందుకు థ్యాంక్యూ మై డియర్‌ ఫ్రెండ్‌ వివేక్‌. ఇకపై నిన్ను ఎంతో మిస్‌ అవుతా’ - ప్రకాశ్‌రాజ్‌

‘మీ మరణవార్త నన్ను ఎంతగానో బాధకు గురి చేసింది. మిస్‌ యూ సర్‌. మీ మరణం చిత్రపరిశ్రమకు పెద్ద లోటు’ - అట్లీ

‘వివేక్‌ మరణవార్త బాధపెట్టింది. ఆయన మరణం కేవలం చిత్రపరిశ్రమే కాకుండా సమాజానికి కూడా  తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. ఆయన చేయాలనుకున్న మంచి కార్యక్రమాలను సాధ్యమైనంత వరకూ నేను చేస్తాను’ - రాఘవా లారెన్స్‌

‘మా తరానికి చెందిన ఓ గొప్ప హాస్యనటుడు వివేక్‌ మరణవార్తతో నేను ఉలిక్కిపడ్డాను. నా హృదయం ముక్కలైంది. నేను ఎప్పటికీ ఆయనకు వీరాభిమానినే. వివేక్‌.. మా హృదయాల్లో మీరు చిరస్థాయిగా ఉంటారు’ - దేవిశ్రీ ప్రసాద్‌

‘ఎన్నో పాత్రల్లో నటించి మీరు మమ్మల్ని ఆనందింపజేశారు. ఇకపై మిమ్మల్ని మిస్‌ అవుతాం’ - నందిని రెడ్డి

‘మంచి వ్యక్తి, అద్భుతమైన నటుడు అయిన వివేక్‌ మనల్ని విడిచివెళ్లిపోయారని తెలిసి ఎంతో బాధపడ్డాను. మీతో కలిసి స్క్రీన్‌ పంచుకున్నందుకు సంతోషిస్తున్నా. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా’ - సురభి

‘మీ నటనతో ఎంతోమంది ముఖాలపై చిరునవ్వులు పూయించారు. ఓ గొప్ప హాస్యనటుడు, అద్భుతమైన నటుడు, సామాజిక సృహ కలిగిన వ్యక్తి మీరు. అలాంటిది ఇకపై మీరు మా మధ్య ఉండరు అనే ఆలోచనే ఎంతో భయంకరంగా ఉంది. ఒక అభిమానిగా మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతా’ - విక్రమ్‌ ప్రభు

‘వివేక్‌ మరణవార్త విని షాక్‌కు గురయ్యాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ - కార్తిక్‌ సుబ్బరాజ్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని