close
Published : 08/04/2021 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

6 సినిమాల తర్వాత అదే నెలలో.. పవన్‌ చిత్రం

‘వకీల్‌సాబ్‌’ విశేషాలివే

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆకలి తీర్చుకునేందుకు సింహం అడవిలోని జంతువులను ఎలా వేటాడుతుందో అదే మాదిరిగా బాక్సాఫీస్‌ రికార్డులను కొల్లగొట్టడానికి సిద్ధమవుతున్నారు అగ్రకథానాయకుడు పవన్‌కల్యాణ్‌. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆయన వెండితెర వేదికగా ప్రేక్షకుల్ని మెప్పించడానికి ‘వకీల్‌సాబ్‌’గా వచ్చేస్తున్నారు. కథలో కమర్షియల్‌ హంగులు లేనప్పటికీ ఆయన స్టార్‌డమ్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ‘వకీల్‌సాబ్‌’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్‌’ విశేషాలు మీకోసం..

బాబోయ్‌.. ఇన్నిరోజుల వెయిటింగా..!

‘పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌’.. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత కథానాయకుడిగా  పవన్‌ పేరు సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించలేదు. తెరపై మరోసారి ఆయన బొమ్మ చూసేందుకు దాదాపు 1186 రోజుల (నేటివరకూ) నుంచి అభిమానులు ఆశగా ఎదురుచూశారు. మరికొన్ని గంటల్లో ‘వకీల్‌సాబ్‌’ రిలీజ్‌తో వాళ్ల నిరీక్షణకు సరైన సమాధానం దొరకనున్నట్లు తెలుస్తోంది.


కొన్ని హిట్లు.. కొన్ని ఫట్లు..!

ఒక్కసారి క్యాలెండర్‌ వెనక్కి తిప్పితే పవన్‌కల్యాణ్‌ కెరీర్‌లో సూపర్‌హిట్స్‌గా చెప్పుకొనే ‘బద్రి’, ‘ఖుషి’, ‘జల్సా’ వంటి చిత్రాలు విడుదలయ్యింది ఏప్రిల్‌ నెలలోనే. అదే మాదిరిగా ‘జాని’, ‘తీన్‌మార్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ వంటి మిశ్రమ స్పందనలందుకున్న సినిమాలు కూడా ఆయా సంవత్సరాల్లో ఇదే నెలలో వచ్చాయి. అలా, ‘వకీల్‌సాబ్‌’.. పవన్‌ కెరీర్‌లోనే ఏప్రిల్‌లో విడుదలైన ఏడో సినిమా కానుంది.


ముచ్చటగా మూడోసారి..!

పవన్‌కల్యాణ్‌-శ్రుతిహాసన్‌ కలిసి నటిస్తున్న మూడో చిత్రమిది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘గబ్బర్‌సింగ్‌’, ‘కాటమరాయుడు’ వచ్చిన విషయం తెలిసిందే. కోర్టు రూమ్‌ డ్రామాగా సాగే ఈ సినిమాలో శ్రుతి-పవన్‌ల మధ్య గత చిత్రాల మాదిరి రొమాన్స్‌ ఉండకపోవచ్చు కానీ.. వీళ్లిద్దరి లవ్‌ట్రాక్‌లో వచ్చే ‘కంటిపాప’ సాంగ్‌ మాత్రం కనువిందు చేయనున్నట్లు అర్థమవుతోంది.


తొమ్మిదేళ్ల తర్వాత వాదోపదాలు..!

పవన్‌కల్యాణ్‌-ప్రకాశ్‌రాజ్‌ ఇద్దరూ కలిస్తే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లకు కొదవే ఉండదు. ‘సుస్వాగతం’, ‘బద్రి’, ‘జల్సా’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ చిత్రాల్లో వీళ్లిద్దరి మధ్య వచ్చిన పంచ్‌ డైలాగ్‌లకు ఇప్పటికే ఎన్నోసార్లు ఫ్యాన్స్‌ ఈలలు వేశారు. ఇప్పుడు ‘వకీల్‌సాబ్‌’ కోసం కోర్టులో మరోసారి వాదోపవాదాలు చేసుకోనున్నారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరగనుంది. ఈ సినిమాలో ఉన్న మరో విశేషమేమిటంటే.. ఇందులో ప్రకాశ్‌రాజ్‌ పేరు నందా. ‘బద్రి’లో కూడా ప్రకాశ్‌ పేరు నందానే.


వాళ్లిద్దరికీ మొదటిసారే..!

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, సంగీత దర్శకుడు తమన్‌కు పవన్‌తో సినిమా చేయాలనే కోరిక ఈ సినిమాతో తీరింది. ఎందుకంటే వాళ్లిద్దరికీ పవన్‌తో ఇదే తొలి చిత్రం. ఎంతోమంది స్టార్‌హీరోల చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన దిల్‌రాజు ఎప్పటినుంచో పవన్‌తో సినిమా చేయాలనుకున్నారట. ఆ కల ‘వకీల్‌సాబ్‌’తో తీరింది. అలాగే తమన్‌ కూడా పవన్‌కి పెద్ద అభిమాని.. దాంతో ఆయన సినిమాకి పనిచేయాలని అనుకుంటున్న తరుణంలో ఇది సువర్ణావకాశంలా వరించింది.


కోర్టు సీన్స్‌..

ఇప్పటివరకూ పవన్‌ సినిమాల్లో చాలా తక్కువ సందర్భాల్లో కోర్టు రూమ్స్‌ చూశాం. అలా వచ్చిన, ‘గోపాల గోపాల’ తర్వాత కోర్టు సన్నివేశాల్లో పవన్‌ని చూసింది ‘వకీల్‌సాబ్‌’లోనే. ‘గోపాల గోపాల’లో పవన్‌ కేవలం కోర్టులో కనిపిస్తారు అంతే. కానీ ఇందులో మాత్రం ఆయన లాయర్‌గా న్యాయం కోసం వాదిస్తారు కూడా.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని