Tollywood: స్టార్‌ హీరోలు.. క్రేజీ బైక్‌ రైడ్‌లు - star heroes and their crazy bike ride in movies
close
Updated : 03/07/2021 10:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: స్టార్‌ హీరోలు.. క్రేజీ బైక్‌ రైడ్‌లు

ఆకట్టుకున్న పోస్టర్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్‌, ‘PSPK28’.. ఇలా ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమా పోస్టర్లు, స్పెషల్‌ వీడియోలు చూస్తే అందులో కామన్‌గా కనిపించేది ఒకే ఒక్కటి. అదే బైక్‌. హీరోలు బైక్‌పై రైడ్‌కు వెళ్లడం చాలా తెలుగు సినిమాల్లో చూశాం. కానీ, హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే విధంగా ఖరీదైన, విభిన్నమైన బైక్స్‌ని చూపించడం చాలా అరుదుగా చూస్తాం. ఇప్పుడు అదే కోవలో.. మన హీరో పాత్రకు తగ్గట్టు ఆయన హీరోయిజాన్ని మరింత పెంచేవిధంగా బైక్‌లను సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అలా వచ్చిన ద్విచక్ర వాహనాలపై ఓ లుక్కేయండి..!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆనాటి పోరాటయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ పాత్రలను చెర్రీ, తారక్‌ పోషిస్తున్నారు. కథకు అనుగుణంగా మన్నెందొర రామరాజుగా కనిపించనున్న చెర్రీ గుర్రపు స్వారీ.. గొండ్రు బెబ్బులి కొమురంభీమ్‌ పాత్ర పోషించనున్న తారక్‌ ద్విచక్ర వాహనం నడుపుతున్నట్లు ఉన్న ఓ పోస్టర్‌తో గతంలో అందర్నీ ఆకర్షించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ తాజాగా చెర్రీ-తారక్‌ ఒకే బైక్‌పై రైడ్‌కు వెళ్తున్న పోస్టర్‌తో సర్‌ప్రైజ్‌ చేసింది. అందులో తారక్‌ నడుపుతున్న బైక్‌ పేరు రెట్రో వెలోసెట్ (Retro Velocette). ఆనాటి రోజులకు అద్దం పట్టేలా వెలోసెటో బ్రాండ్‌కు చెందిన ఈ వింటేజ్‌ మోడల్‌ ద్విచక్ర వాహనాన్ని సినిమాలో ఉపయోగించారు. ఎన్టీఆర్‌ హీరోయిజానికి ఇది మరింత అద్దం పట్టేలా ఉంది.

అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌లో..

మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’. పవన్‌కల్యాణ్‌-రానా ప్రధానపాత్రలుగా ఈ సినిమా తెలుగులో రీమేక్‌ అవుతోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూట్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. షూట్‌ విశేషాల గురించి తెలియజేస్తూ అప్పట్లో ఓ స్పెషల్‌ వీడియోని చిత్రబృందం షేర్‌ చేసింది. ఇందులో పవన్‌కల్యాణ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌పై ఎంట్రీ ఇస్తున్నట్లు చూపించారు.

‘పుష్ప’..  అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా ఊరమాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. స్మగ్లర్ల నాయకుడిగా బన్నీ లుక్‌కు తగిన విధంగా ఈ సినిమాలో 1955 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ని ఉపయోగించారు. బుల్లెట్‌పై బన్నీ ఉన్న ఓ పోస్టర్‌ని సైతం చిత్రబృందం గతంలో షేర్‌ చేసింది. మరోవైపు అల్లు అర్జున్‌.. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లోనూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై కనిపించారు.

‘సాహో’.. ప్రభాస్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలోని ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌లో ప్రభాస్‌ స్టైలిష్‌ బైక్‌పై కనిపిస్తారు. అదే ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ (Triumph Street Triple RS). అత్యంత ఖరీదైన ఈ బైక్‌ ధర ఇండియాలో సుమారు రూ.9 లక్షలు ఉండొచ్చని సమాచారం. ఇది మాత్రమే కాకుండా ‘మిర్చి’లో సైతం ప్రభాస్‌ అత్యంత ఖరీదైన బైక్‌పైనే అనుష్కతో కలిసి రైడ్‌కు వెళ్తారు. హ్యోసంగ్ ST7 మోడల్‌గా పేరుపొందిన ఈ బైక్‌ ధర సుమారు రూ.6 లక్షలు ఉంటుందట. కేవలం పాటలోనే కాకుండా ‘మిర్చి’ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లోనూ ఈ బైక్‌ మనకు కనిపిస్తుంది.

అర్జున్‌ రెడ్డి.. విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ తీసుకువచ్చిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఆ సినిమాలోని చాలా సన్నివేశాల్లో విజయ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌పై హీరోయిన్‌తో కలిసి రైడ్‌కి వెళ్తూ కనిపిస్తారు. ‘గీతగోవిందం’ సినిమాలోనూ ఆయన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పైనే సందడి చేశారు.

లెజెండ్‌.. బాలయ్య

బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ‘లెజెండ్‌’. ఈ సినిమాలో బాలకృష్ణ డ్రైవ్‌ చేసిన బైక్‌పై అప్పట్లో అందరూ మనసు పారేసుకున్నారు. కేవలం ఒక్క పాటలో మాత్రమే కనిపించే ఆ బైక్‌ కోసం చిత్రబృందం దాదాపు 20 లక్షలు ఖర్చు చేసింది. సినిమాలో బాలయ్య పాత్రను మరింత ఎలివేట్‌ చేసేందుకే బోయపాటి ఈ బైక్‌కు మొగ్గు చూపించారట. హార్లే డేవిడ్‌ సన్‌ బ్రాండ్‌కు చెందిన ఈ బైక్‌ను ప్రత్యేకంగా ఈ సినిమా కోసం డిజైన్‌ చేయించారు. వీళ్లు మాత్రమే కాకుండా మరికొంతమంది హీరోలు సైతం బైక్‌ నడుపుతూ కనిపించారు.


 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని