ఈ హీరోల బిరుదు మారింది బాసూ..! - stylish star to icon star telugu heros screen name change
close
Updated : 20/05/2021 20:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ హీరోల బిరుదు మారింది బాసూ..!

సూపర్‌స్టార్‌,  మెగాస్టార్‌, పవర్‌ స్టార్‌.. వెండితెరపై ఈ పేర్లకున్న క్రేజ్‌ మాములుది కాదు. హీరోల పేర్లకన్నా ఈ బిరుదులనే అభిమానులు అమితంగా ఇష్టపడతారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తమ అభిమాన హీరో పేరు ముందు ప్రత్యేకంగా ఉండటానికి అభిమానులు కొన్నిసార్లు దర్శకులు ఇలా బిరుదులు ఇస్తుంటారు.  అయితే కొందరు హీరోలు గతంలో వచ్చిన పేర్లను మారిపోయి కొత్త టైటిల్‌ పేర్లతో పలకరించిన సందర్భాలున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

ఐకాన్‌స్టార్‌గా.. అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  సుకుమార్‌తో ఆయన తీస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ టీజర్‌తో పాటే, అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో తన పేరుకు ముందు ఐకాన్‌ స్టార్‌ అని ఉండటమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ స్టైలిష్‌ స్టార్‌గా పిలుచుకునే అల్లు అర్జున్‌ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా మారిపోనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

సుప్రీమ్‌ హీరో నుంచి మెగాస్టార్‌

అగ్ర కథానాయకుడు చిరంజీవి అభిమానులు ముద్దుగా మెగాస్టార్‌ అని పిలుచుకుంటారు. ఆ పేరు వెండితెరపై పడితే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తుంటాయి. అయితే మెగాస్టార్‌ కన్నా ముందు డైనమిక్‌ హీరో అని తెరపై పడేది. ఆ తర్వాత అంచెలంచెలుగా స్టార్‌ హీరోగా ఎదుగుతున్న క్రమంలో సుప్రీమ్‌ హీరో అని పిలుచుకునే వారు అభిమానగణం.  ‘మరణమృదంగం’ సినిమా నుంచి చిరు మెగాస్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత కాలంలోనూ మెగాస్టార్‌గానే అభిమానుల గుండెల్లో నిండిపోయారు.  ఇప్పటికీ.. ఎప్పటికీ చిరు మెగాస్టార్‌గానే గుర్తుండిపోతారని చెబుతారు మెగా అభిమానులు.

నటసింహం.. బాలకృష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉంది. క్లాస్‌, మాస్‌, జానపదం, పౌరాణికం ఇలా పాత్ర ఏదైనా ఆయన బరిలోకి దిగనంత వరకే.. ఒకసారి అడుగు పెట్టారా? చరిత్ర సృష్టిస్తారు. కథానాయకుడిగా కెరీర్‌ మొదలు పెట్టినప్పటి నుంచి ఆయనను యువరత్నగానే పిలుచుకునేవారు. అయితే బోయపాటితో తీసిన ‘సింహ’తో బాలకృష్ణ నటసింహంగా మారిపోయాడు.

మన్మథుడి పేరూ మారింది..

తెలుగు చిత్ర పరిశ్రమలో యువ దర్శకులను ప్రోత్సహిస్తూ, ప్రయోగాలకు ఆసక్తి చూపే అగ్ర కథానాయకుడు నాగార్జున. అక్కినేని నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఆయనను అభిమానులు ‘యువ సామ్రాట్‌’ అని పిలుచుకునేవారు. ‘కింగ్‌’ సినిమా తర్వాత ఆయన పేరు ముందు ‘కింగ్‌’ టైటిల్‌ వచ్చి చేరింది.

సూపర్‌స్టార్‌ అలా..

కృష్ణ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు మహేశ్‌బాబు. బాలనటుడిగానే తనదైన ముద్రవేశారు. కృష్ణ స్టార్‌డమ్‌తో పాటు టైటిల్‌నూ కొనసాగిస్తున్నారాయన. మొదటి చిత్రం నుంచే ఆయన ప్రిన్స్‌గా పరిచయం అయ్యారు. ఇప్పుడు  సూపర్‌ స్టార్‌గా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్నారు. ‘దూకుడు’ చిత్రం నుంచి ‘ప్రిన్స్‌’ కాస్తా సూపర్‌ స్టార్‌గా మారిపోయాడాయన. అది మహేశ్‌ కెరియర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

ఎన్టీఆర్‌ ఏ1 స్టార్‌

నూనుగు మీసాల వయసులో టాలీవుడ్‌కి ఇండస్ట్రీ హిట్టు అందించారు ఎన్టీఆర్‌. తాత నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని డైలాగ్‌లు, డ్యాన్స్‌లతో వెండితెరపై చిరుతపులిలా దూకుడుగా కనిపిస్తారు తారక్‌. అందుకే ఆయన్ను ‘యంగ్‌టైగర్‌’ అని అభిమానులు పిలుచుకుంటున్నారు. ‘శక్తి’ సినిమా సందర్భంగా ‘ఏ1 స్టార్‌’గా మారినా ఆ తర్వాత ‘యంగ్‌టైగర్‌’టైటిల్‌తోనే కొనసాగుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని