ఆక్సిజన్‌ పంపిస్తానన్న సుస్మిత.. నెటిజన్‌ సెటైర్‌ - sushmita sen gives it back to a troll who criticised her for sending oxygen cylinders to delhi from mumbai
close
Updated : 23/04/2021 12:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ పంపిస్తానన్న సుస్మిత.. నెటిజన్‌ సెటైర్‌

నెటిజన్‌కి రిప్లై ఇచ్చిన బ్యూటీ

ముంబయి: దిల్లీలోని శాంతి ముకుంద్‌ ఆస్పత్రికి ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేసేందుకు మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌ ముందుకు వచ్చారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత విపరీతంగా ఉందని పేర్కొంటూ ఇటీవల సీఈవో సునీల్‌ సాగర్‌ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. సదరు వీడియో చూసిన సుస్మితా.. ‘హృదయ విదారకమైన పరిస్థితి ఇది. దేశంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్‌ కొరత ఉంది. ఈ ఆస్పత్రికి కొన్ని ఆక్సిజన్‌ సిలీండర్లను నేను అందించగలను. కానీ ముంబయి నుంచి దిల్లీకి వాటిని ఎలా పంపించాలో అర్థం కావడం లేదు. దయచేసి వాటి రవాణాలో నాకు కొంచెం సాయం చేయగలరు’ అని ట్వీట్‌ చేశారు.

కాగా, సుస్మితా సేన్‌ పెట్టిన ట్వీట్‌పై ఓ నెటిజన్‌ సెటైర్‌ వేశాడు. ‘ఆక్సిజన్‌ కొరత అన్నిచోట్ల ఉన్నప్పుడు ముంబయిలో ఉన్న ఆస్పత్రులకు సాయం అందించకుండా దిల్లీలోని వాటికే ఎందుకు సాయం చేస్తున్నారు?’ అని ఆమెని ప్రశ్నించాడు. దీంతో అసహనానికి గురైన సుస్మిత.. ‘ఎందుకంటే, నాకు తెలిసినంత వరకు ముంబయిలో ఆక్సిజన్‌ కొరత అంతగా లేదు. ప్రస్తుతం దిల్లీలోని ఎన్నో ఆస్పత్రుల్లో ప్రాణవాయువు అవసరం ఉంది. ముఖ్యంగా చిన్న ఆస్పత్రులకు. కాబట్టి మీరు సాయం చేయగలిగితే చేయండి’ అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని