తమన్నా సువిశాలమైన ఇంటిని చూశారా - tamanna bhatia home tour
close
Updated : 20/03/2021 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమన్నా సువిశాలమైన ఇంటిని చూశారా

వైరల్‌గా మారిన మిల్కీబ్యూటీ హోమ్‌టూర్‌ వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస సినిమాల‌తో బిజీగా ఉండే మిల్కీబ్యూటీ తమన్నా తాజాగా తన హోమ్‌ టూర్‌తో నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఓ ప్రముఖ పెయింటింగ్స్‌ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ముంబయిలోని తన సువిశాలమైన నివాసాన్ని తమన్నా అందరికీ పరిచయం చేశారు. షూటింగ్స్‌ కారణంగా తాను ఇంట్లో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం లేదని ఆమె అన్నారు. ఎప్పుడైనా ఇంట్లో ఉంటే తన తల్లిదండ్రులతో సరదాగా మాట్లాడుతూ.. టీ సేవించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తానని ఆమె తెలిపారు. హోమ్‌ టూర్‌లో భాగంగా తనకెంతో ఇష్టమైన పెంపుడు శునకాన్ని తమన్నా పరిచయం చేశారు.

‘‘సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఇంటీరియర్‌ డిజైన్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని నాన్నే దగ్గరుండి చూసుకున్నారు. సినిమా షూటింగ్స్‌, ఇతర పనుల రీత్యా నేను ఇంట్లో చాలా తక్కువ సమయాన్ని గడుపుతుంటాను. అయితే ఇంటికి రాగానే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ నివాసం నాకు ప్రతిరోజూ కొత్తగానే ఉంటుంది’’ అని తమన్నా వివరించారు. ఇక, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమన్నా ‘ఎఫ్‌-3’, ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాల్లో నటిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని