చిరు నిర్ణయంపై తమిళిసై హర్షం - tamilisai appreciates chiranjeevi decision
close
Published : 23/04/2021 10:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు నిర్ణయంపై తమిళిసై హర్షం

హైదరాబాద్‌: సినీ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు అగ్రకథానాయకుడు చిరంజీవి తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ‘తెలుగు సినీ దిగ్గజ నటుడు శ్రీ చిరంజీవిగారు కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా అపోలో సహకారంతో సినీ కార్మికులు, సినీ జర్నలిస్ట్‌లకు ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం. ఇది ఒక మంచి ప్రయత్నం’ అని ఆమె పేర్కొన్నారు.

గతేడాది కరోనా సమయంలో సినీ కార్మికులకు అండగా ఉండేందుకు చిరంజీవి కరోనా క్రైసిస్‌ ట్రస్ట్‌ను ప్రారంభించారు. దాని ద్వారా వచ్చిన విరాళాలతో కార్మికులకు అవసరమైన సాయాన్ని ముందుండి అందించారు. ఈ క్రమంలో కరోనా విజృంభణ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడేందుకు అపోలో హాస్పిటల్స్‌ సౌజన్యంతో ఫ్రీ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ని నిర్వహిస్తున్నట్లు ఇటీవల చిరంజీవి ప్రకటించారు. కేవలం సినీ కార్మికులు, జర్నలిస్టులకు మాత్రమే కాకుండా వారి జీవిత భాగస్వాములకు సైతం వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నట్లు ఆయన తెలియజేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని