‘సొగసు చూడ తరమా’ ఫస్ట్‌లుక్
హైదరాబాద్: ‘సొగసు చూడ తరమా’ ఫస్ట్‌లుక్‌ను మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేయటం సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. తల్లాడ సాయి కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నక్షత్ర కథానాయికగా నటిస్తోంది.
ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘‘కంటెంట్ ఉన్న ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆరేళ్ల నుంచి సాయికృష్ణ, అతని టీమ్‌ను చూస్తున్నా. సినిమా కోసం వాళ్లు పడే తపన చూస్తుంటే ముచ్చటేస్తోంది. టైటిల్ వింటుంటే ఒక మంచి లవ్ స్టోరీలా అనిపిస్తోంది. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని అన్నారు.
దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ‘‘సొగసు చూడ తరమా’ ఫస్ట్‌లుక్ విడుదల చేసిన తనికెళ్ల భరణిగారికి ధన్యవాదములు. ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. అరకులో జరిగే అందమైన కథ. దీనికి హాస్యాన్ని జోడిస్తూ చక్కని సందేశాన్నిచ్చేలా తీర్చిదిద్దాం. మహిళా దినోత్సవం రోజున ఆడవాళ్లను సన్మానిస్తే సరిపోదు. రోజూ వారిని గౌరవించాలి’ అని అన్నారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కథానాయిక నక్షత్ర అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం వివేకానంద విక్రాంత్, అను ,విజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వి.ఆర్.ఎ. ప్రదీప్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి శివ రాథోడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
- వెంకటేష్, వరుణ్‌తేజ్ చిత్రంలో అంజలి!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
‘ఇష్క్’ నుంచి ‘ఆగలేకపోతున్నా..’