తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు ఓపెన్‌! - telangana film chamber of commerce members meets minister talasani
close
Updated : 17/07/2021 19:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు ఓపెన్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణలో ఆదివారం నుంచి సినిమా థియేటర్లను తెరవాలని రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిర్ణయించింది. లాక్‌డౌన్ వల్ల థియేటర్లు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఎగ్జిబిటర్లు పలుమార్లు తమ బాధలను ప్రభుత్వానికి విన్నవించారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లి వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి థియేటర్లను ఆదుకునేందుకు స్పష్టమైన హామీ రావడంతో ఆదివారం నుంచి సినిమా హాల్స్ తెరవాలని తెలంగాణ ఫిల్మ్ చాంబర్, థియేటర్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సంయుక్తంగా నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు ఎవరైనా రేపటి నుంచి సినిమాలను ప్రదర్శించుకోవచ్చని, ఈ నెల 23 నుంచి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న దృష్ట్యా థియేటర్లు తెరుచుకోవచ్చని సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే 100 శాతం సీట్ల సామర్థ్యంతో అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో అన్ని మల్టీఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగించాలని తీర్మానించినట్లు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కార్యదర్శి విజయేందర్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రభుత్వానికి చేసిన వినతులు..

* 2017లో తీసుకొచ్చిన జీఓ.75 విషయంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలి.

* సినిమా థియేటర్‌కు వచ్చే వాహనదారుల నుంచి పార్కింగ్‌ రుసుము వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి.

* లాక్‌డౌన్‌ సమయంలో థియేటర్లు అన్ని మూతపడి ఉన్నాయి. అయినా విద్యుత్తుశాఖ నామమాత్రపు ఛార్జీలు విధించింది. ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలి. 

* కరోనా వల్ల ఆదాయం లేకపోవడంతో ఎగ్జిబిటర్లు తీవ్రనష్టాలు చవిచూశారు. వాళ్లకు ఉపశమనం కలిగించేందుకు రెండేళ్ల పాటు మున్సిపల్‌/ప్రాపర్టీ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు కల్పించాలి.

* జీఎస్‌టీ తగ్గించి సినిమా థియేటర్లను కాపాడాలి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని