Flim Chamber: పవన్‌ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: ఫిల్మ్‌ ఛాంబర్‌ - telugu film chamber respond about pawan kalyan comments
close
Updated : 26/09/2021 22:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Flim Chamber: పవన్‌ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: ఫిల్మ్‌ ఛాంబర్‌

హైదరాబాద్‌: ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ వేడుక సందర్భంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో వాడీవేడీ చర్చ జరుగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం నష్టం కలిగిస్తోందంటూ ఆయన చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపింది. ఆదివారం ఉదయం నుంచి ఏపీ మంత్రులు, వైకాపా నాయకులు పవన్‌ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటన విడుదల చేసింది. చిత్ర పరిశ్రమ మనుగడ సాగించాలంటే రెండు ప్రభుత్వాల మద్దతు అవసరమని చెప్పుకొచ్చింది. వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తమకూ సంబంధం లేదని తెలిపింది.

‘‘కరోనా కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యల్లో చిక్కుకుంది. సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాల మద్దతు అవసరం. ప్రభుత్వాల మద్దతు లేకుండా సినీ పరిశ్రమ మనుగడ కష్టం. సినీ పరిశ్రమపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలు వివిధ వేదికలపై చెబుతున్నారు. వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదు. చిత్ర పరిశ్రమను నమ్ముకుని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. కరోనా మహామ్మారి సహా వివిధ అంశాలపై తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి పేర్నినానితో చర్చించాం. ముఖ్యమంత్రి జగన్ సినీ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు.  మార్చి 2020 నుంచి ఇండస్ట్రీలోని కళాకారులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నాయకులు, ప్రభుత్వ మద్దతు కావాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమను కాపాడేందుకు ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూనే ఉన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సినీ పరిశ్రమకు ఇరు రాష్ట్రాల సీఎంల మద్దతు ఇలాగే కొనసాగాలి’’ అని ప్రకటనలో తెలిపింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని