Cinema News: వారసుడి చిత్రం మొదలైంది - telugu news debutant actor Virat Raj New Movie Launch Event
close
Updated : 21/10/2021 08:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: వారసుడి చిత్రం మొదలైంది

సీనియర్‌ నటుడు హరనాథ్‌ కుటుంబం నుంచి  పరిచయమవుతున్న మరో నట వారసుడు విరాట్‌రాజ్‌. హరనాథ్‌ సోదరుడు వెంకట సుబ్బరాజు మనవడైన విరాట్‌రాజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సీతామనోహర శ్రీరాఘవ’ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వందన మూవీస్‌ పతాకంపై సుధాకర్‌.టి నిర్మిస్తున్న ఈ సినిమాకి దుర్గా శ్రీవత్సస.కె దర్శకత్వం వహిస్తున్నారు. రేవ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం క్లాప్‌నిచ్చారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి క్లాప్‌నిచ్చారు. యువ కథానాయకుడు ఆకాష్‌పూరి గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్‌ నటులు కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవితోపాటు, నిర్మాత డి.సురేష్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘మాస్‌ ఎంటర్‌టైనర్‌గా, భిన్న భావోద్వేగాల సమ్మిళితంగా రూపొందుతున్న చిత్రమిది. ఈ పేరు వెనకే కథ ఉంది. సకుటుంబ సమేతంగా చూసేలా సినిమాని తీర్చిదిద్దుతున్నాం. ‘కె.జి.ఎఫ్‌’, ‘సలార్‌’ చిత్రాల స్వరకర్త రవి బస్రూర్‌ సంగీతం, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాకి పోరాటాలు సమకూర్చిన కింగ్‌ సాల్మన్‌ యాక్షన్‌ ఘట్టాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. విరాట్‌రాజ్‌ ఇకపై భిన్న రకాల సినిమాలకి తగ్గ ఇమేజ్‌ని సొంతం చేసుకునేలా ఆయన పాత్రని డిజైన్‌ చేశాం’’ అన్నారు. ‘‘మా తాతయ్యల స్ఫూర్తితో హీరోగా పరిచయం అవుతున్నా. నా తొలి చిత్రానికి సరైన కథ ఇది’’ అన్నారు కథానాయకుడు. వచ్చే నెలలో రెగ్యులర్‌ చిత్రీకరణని ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, పృథ్వీ, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, ప్రవీణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కల్యాణ్‌.బి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని