Akshay Kumar: అక్షయ్‌.. ‘ఓఎమ్‌జి 2’ - telugu news Akshay Kumar Announced O My God 2 With New Poster
close
Updated : 24/10/2021 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akshay Kumar: అక్షయ్‌.. ‘ఓఎమ్‌జి 2’

అరడజనుకు పైగా చిత్రాలతో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌. ఇప్పుడాయన జాబితాలో మరో కొత్త చిత్రం చేరింది. అదే ‘ఓఎమ్‌జి 2’ (ఓ మై గాడ్‌ 2). ఈ సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో అక్షయ్‌ శివుడి అవతారంలో ఉన్నట్లు  కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో ఓ స్కూల్‌ పిల్లాడిని కూడా చూడొచ్చు. 2012లో విడుదలై విజయాన్ని అందుకున్న ‘ఓ మై గాడ్‌’కు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. తొలి భాగంలో ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ అనే కథాంశాన్ని ఎంచుకోగా.. ఇందులో మరో కొత్త కాన్సెప్ట్‌ను చూపించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని అమిత్‌ రాయ్‌ తెరకెక్కిస్తున్నారు. కేఫ్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, వకూ ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా  ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అక్షయ్‌ - పరేశ్‌ రావెల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓ మై గాడ్‌’ను తెలుగులో ‘గోపాల గోపాల’గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ కథానాయకులుగా నటించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని