Mr Premikudu: ‘మిస్టర్‌ ప్రేమికుడు’ వస్తున్నాడు - telugu news Prabhudeva Starer Mr Premikudu Release date Announced
close
Updated : 21/10/2021 08:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mr Premikudu: ‘మిస్టర్‌ ప్రేమికుడు’ వస్తున్నాడు

ప్రభుదేవా, అదా శర్మ, నిక్కి గల్రాని నాయకానాయికలుగా శక్తి చిదంబరం తెరకెక్కించిన చిత్రం ‘చార్లీ చాప్లిన్‌ 2’. ఇటీవలే  తమిళనాట విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడీ సినిమాని ‘మిస్టర్‌ ప్రేమికుడు’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు నిర్మాతలు వి.శ్రీనివాసరావు, గుర్రం మహేష్‌ చౌదరి. దీన్ని ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమిది. పాటలతో పాటు ద్వితీయార్ధంలో వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రభుదేవా డ్యాన్స్‌తో పాటు అదా, నిక్కిల అందం, అభినయం చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని