rowdy boys: ‘రౌడీ బాయ్స్‌’ పాట సందడి - telugu news Rowdy Boys second song launched
close
Updated : 21/10/2021 08:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

rowdy boys: ‘రౌడీ బాయ్స్‌’ పాట సందడి

‘ప్రేమే ఆకాశమైతే ఓ మై జాను... అందులో ఎగిరే పక్షులంట నువ్వు నేను...’’ అంటూ పాడుకున్నాడు రౌడీబాయ్‌. అతని ప్రేమకథేమిటో తెలియాలంటే ‘రౌడీ బాయ్స్‌’ చూడాల్సిందే. ప్రముఖ నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో గీతమైన ‘ప్రేమ ఆకాశమైతే...’ని బుధవారం యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరకల్పనలోని ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, జస్‌ప్రీత్‌ జస్జ్‌ ఆలపించారు. ఈ పాట విడుదల కోసం హైదరాబాద్‌లో ఓ వేడుకని నిర్వహించారు. విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. త్వరలో దిల్‌రాజు నిర్మాణంలో సినిమా చేయనున్నట్టు తెలిపారు.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని