Oscars: ఆస్కార్‌ బరిలో ‘కూళాంగల్‌’ - telugu news Tamil film Koozhangal is Indias official entry to Oscars
close
Updated : 24/10/2021 07:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oscars: ఆస్కార్‌ బరిలో ‘కూళాంగల్‌’


భారతదేశం తరఫున ఆస్కార్‌-2022 పోటీలో నిలవడానికి తమిళ చిత్రం ‘కూళాంగల్‌’ ఎంపికైంది. దీనికి పీఎస్‌ వినోద్‌రాజ్‌ అనే యువకుడు  దర్శకత్వం వహించారు. ప్రముఖ కథానాయిక నయనతార, దర్శకుడు, నిర్మాత విఘ్నేష్‌ శివన్‌ నిర్మించారు. యువన్‌ శంకర్‌రాజా సంగీత సారథ్యం  వహించారు. 15మంది సభ్యులు గల జ్యూరీ వివిధ భాషల నుంచి వచ్చిన మొత్తం 14 చిత్రాలను పరిశీలించింది. ఇందులో విక్కీ కౌశల్‌ నటించిన ‘సర్ధార్‌ ఉద్దమ్‌’, విద్యాబాలన్‌ ‘షేర్నీ’ ఉన్నాయి. వీటన్నింటినీ వెనక్కి నెట్టి ‘కూళాంగల్‌’ దేశం తరఫున ఆస్కార్‌ బరిలో నిలవడానికి సిద్ధమైంది. కూళాంగల్‌ అంటే.. గులకరాళ్లు అని అర్థం. సినిమా మొత్తం కొండలు, గులకరాళ్ల నిండిన ప్రాంతంలో సాగుతుంది. తాగుబోతు తండ్రిని మార్చి ఇంట్లోంచి వెళ్లిపోయిన తన తల్లిని తీసుకు రావడానికి ఓ అబ్బాయి చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథ. ఈ సందర్భంగా విఘ్నేష్‌ శివన్‌ మాట్లాడుతూ ‘‘ఎన్నో సంవత్సరాల కల. ఆస్కార్‌ అందుకోవడానికి ఇక రెండు అడుగుల దూరంలోనే ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది.’’ అన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని