Most Eligible Bachalore: ఈ విజయం తెలుగు ప్రేక్షకుల వల్లే - telugu news Thankyou Meet Of Most Eligible Bachelor held At Hyderabad
close
Updated : 18/10/2021 07:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Most Eligible Bachalore: ఈ విజయం తెలుగు ప్రేక్షకుల వల్లే

- అఖిల్‌

అఖిల్‌, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం   విశాఖపట్టణంలో థ్యాంక్‌ యూ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల్‌ మాట్లాడుతూ.. ‘‘వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతిచ్చినందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ సినిమాతో టీమ్‌ వర్క్‌లోని గొప్పతనాన్ని తెలుసుకున్నా. నిజాయితీగా మంచి సినిమా తీయాలనే లక్ష్యంతో కష్టపడ్డాం. మా ప్రయత్నానికి ఇంత మంచి విజయం దక్కిందంటే అది తెలుగు ప్రేక్షకుల వల్లే. అందుకే అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో ఓ కొత్త అఖిల్‌ని చూశారు. ఆయన పంచిన వినోదాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు’’ అన్నారు దర్శకుడు భాస్కర్‌. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘భార్యాభర్తలు నేర్చుకోవాల్సిన మంచి విషయాల్ని ఈ సినిమాలో చూపించారు. ప్రతి మహిళ తప్పనిసరిగా తమ భర్తల్ని ఈ చిత్రానికి తీసుకువెళ్లండి. ఇందులోని సందేశాన్ని ఇద్దరూ ఆస్వాదిస్తార’’న్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు సినీ ప్రముఖులు బన్నీవాసు, వాసు వర్మ, గెటప్‌ శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని