Cinema News: విజయమే లక్ష్యంగా.. - telugu news Upcoming Movies In Tollywood
close
Updated : 17/10/2021 07:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: విజయమే లక్ష్యంగా..

పండగ వస్తుందంటే చాలు.. చిత్రసీమలో ప్రచార పర్వం పదునెక్కుతుంది. ఇక విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి వచ్చిందంటే .. ఆ సందడి రెట్టింపవుతుంది. దసరా రోజున పలువురు అగ్రతారలు కొత్త కబుర్లు వినిపించారు. ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్లో జోష్‌ నింపారు. చిత్రసీమకు నూతనోత్తేజాన్ని అందించారు.


‘పెద్దన్న’గా రజని..

జనీకాంత్‌ కథానాయకుడిగా శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. నయనతార, కీర్తి సురేష్‌, మీనా తదితరులు ముఖ్య పాత్రలు   పోషిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీపావళి సందర్భంగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.


లుక్కు .. కిక్కు

సరా వేళ పలు చిత్ర బృందాలు ప్రచార చిత్రాలతో వినోదం పంచిచ్చాయి. వెంకటేష్‌,  వరుణ్‌తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. తమన్నా, మెహ్రీన్‌ కథానాయికలు. విజయ దశమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ కొత్త లుక్‌ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో వెంకీ, వరుణ్‌ తమ జోడీలతో సరదాగా సందడి చేస్తూ  కనిపించారు. పండగ వేళ ‘పక్కా కమర్షియల్‌’ నుంచి జంటగా వచ్చి పలకరించారు గోపీచంద్‌, రాశి ఖన్నా. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న ఈ సినిమాని మారుతి తెరకెక్కిస్తున్నారు. విప్లవంతో నిండిన ఓ ప్రేమకథను ‘విరాటపర్వం’తో రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు రానా, సాయిపల్లవి. వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్ర కొత్త ప్రచార చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేశారు. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అంటూ పండగ రోజు తన జోడీతో రష్మికతో కలిసి ప్రేక్షకుల ముందుకొచ్చాడు శర్వానంద్‌. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న ఈ సినిమాని కిషోర్‌ తిరుమల తెరకెక్కిస్తున్నారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్న బాక్సింగ్‌ నేపథ్య చిత్రం ‘గని’. డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దసరా సందర్భంగా కొత్త లుక్‌ విడుదల చేశారు. వీటితో పాటు ‘ఎనిమి’, ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’, ‘అర్జున ఫాల్గున’, ‘రొమాంటిక్‌’, ‘హీరో’ తదితర చిత్ర బృందాలు కొత్త ప్రచార చిత్రాలు విడుదల చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశాయి.


‘జెర్సీ’ దర్శకుడితో చరణ్‌..

కథానాయకుడు రామ్‌చరణ్‌, ‘జెర్సీ’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి కలయికలో ఓ చిత్రం రూపొందనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు పండగ వేళ అధికారికంగా ప్రకటించారు. చరణ్‌ నటించనున్న 16వ చిత్రమిది. విభిన్నమైన స్పోర్ట్స్‌ డ్రామా కథాంశంతో తెరకెక్కనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.


సామ్‌.. డబుల్‌ ధమాకా

విజయదశమి సందర్భంగా సినీప్రియులకు రెండు కొత్త కబుర్లు వినిపించింది నటి సమంత. వాటిలో ఒకటి శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించనున్న ద్విభాషా చిత్రం. దీన్ని హరి - హరీష్‌ అనే ఇద్దరు కొత్త దర్శకులు సంయుక్తంగా తెరకెక్కించనున్నారు. నవంబరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు నిర్మాత ప్రకటించారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థలోనూ ఓ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించనుంది సమంత. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంతో.. శంతరూబెన్‌ జ్ఞానశేఖరన్‌ అనే ఓ కొత్త దర్శకుడు తెరకు పరిచయం కానున్నాడు. ఇందులో సామ్‌ రచయితగా కనిపించనుందని చిత్ర బృందం తెలియజేసింది.


జమ్మివెట్టి జెప్పిన నాని..

హీరో నాని ‘దసరా’ అనే మరో కొత్త చిత్రం ప్రకటించారు. దీని టైటిల్‌ పోస్టర్‌తో పాటు వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. తెలంగాణ నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ చిత్రమిది. బొగ్గు గనుల కథాంశంతో రూపొందుతోంది. ‘‘ఈ దసరా నిరుడు లెక్కుండది.. బాంచత్‌. జమ్మివెట్టి జెప్తాన్న.. బద్దల్‌ బాసింగాలైతై.. ఎట్లతే గట్లైతది.. సూసుకుందాం’’ అంటూ గ్లింప్స్‌లో నాని చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని.. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్‌ కథానాయిక.


ముచ్చటగా మూడోసారి

నిఖిల్‌ కథానాయకుడిగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘‘స్వామిరారా’, ‘కేశవ’ చిత్రాల తర్వాత నిఖిల్‌, సుధీర్‌ కలయికలో రూపొందనున్న మూడో చిత్రమిది.


పేరు ప్రకటించారు..

ప్రస్తుతం రవితేజ నటించిన ‘ఖిలాడి’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘రామారావు’ చిత్రీకరణ దశలో ఉంది. వీటితో పాటు నక్కిన త్రినాథరావు దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ధమాకా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. డబుల్‌ ఇంపాక్ట్‌.. అన్నది ఉపశీర్షిక. పండగ సందర్భంగా రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’, ‘రామారావు’ సినిమాల నుంచి కొత్త ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి.


 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని