Cinema News: కుటుంబ నేపథ్యంలో... - telugu news Vastunna Vachestunna First Look Poster out now
close
Updated : 20/10/2021 07:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: కుటుంబ నేపథ్యంలో...

కార్తీక్‌రాజు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వస్తున్నా... వచ్చేస్తున్నా’. మిస్తీ చక్రవర్తి కథానాయిక. సందీప్‌ గోపిశెట్టి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ  దర్శకుడు శేఖర్‌ కమ్ముల విడుదల చేశారు. టీజర్‌ ఆకట్టుకునేలా ఉందని, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చిత్ర దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘కుటుంబ నేపథ్యంతో కూడిన ఓ థ్రిల్లర్‌ చిత్రమిది. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రేక్షకులు ఆశ్చర్యపోయే అంశాలు ఎన్నో ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ని విడుదల చేస్తాం’’ అన్నారు. ప్రశాంత్‌, భీమనేని శ్రీనివాస్‌, దేవిప్రసాద్‌, పోసాని కృష్ణమురళి, ఆమని, గణపతి, అన్వి, డా.శేషసాయి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మహి శార్ల.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని