Dhee: ప్రియమణి కోరిక.. డ్యాన్స్‌తో అదరహో అనిపించిన ఆది! - telugu news aadi dance performance in dhee priyamani
close
Published : 18/09/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dhee: ప్రియమణి కోరిక.. డ్యాన్స్‌తో అదరహో అనిపించిన ఆది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడూ పంచ్‌లేసి కడుపుబ్బా నవ్వించే ఆది.. ప్రియమణి కోరిక మేరకు స్టెప్పులు వేశాడు. అందరినీ ఆశ్చర్యంలో ముంచాడు. ఎక్కడంటారా? ఇంకెక్కడ... ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘ఢీ 13’ కార్యక్రమం వేదికపై. ఈ షోకి న్యాయ నిర్ణేతలుగా ప్రియమణి, పూర్ణ, గణేశ్‌ మాస్టర్‌, కింగ్స్‌ టీమ్‌ లీడర్లుగా ఆది, సుధీర్‌ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డ్యాన్స్‌ రియాల్టీ షోలో ప్రియమణి.. ఆదిని బావా అని పిలుస్తూ ప్రేక్షకులకి వినోదం పంచుతుంటారు. ఆమెకి ఆది డ్యాన్స్‌ చేస్తే చూడాలనిపించింది. అయితే మాత్రం ఆది నృత్యం ఎలా చేస్తాడు? అనేదే కదా మీ సందేహం? ప్రియమణి ప్రేమగా అడిగితే ఎందుకు నో చెప్తాడు. సై అన్నాడు. ‘బావా.. నా కోసం డ్యాన్స్‌ చేయవా!’ అని ప్రియమణి ముద్దుగా అడగటంతో తనదైన శైలిలో స్టెప్పులేసి, వావ్‌..! అనిపించాడు. అలా నాన్‌స్టాప్‌గా డ్యాన్స్‌ చేసి అలరించిన ఆదిని పూర్ణ సైతం ‘బావా..’ నా కోసం చేయవా అని అడగ్గానే మరో గీతానికి కాలు కదిపి, అదరగొట్టాడు. మరి ప్రియమణి, పూర్ణ కోరిక మేరకు ‘బేగంపేట బుల్లమ్మో’ (శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌), ‘నైరే నైరే’ (ఆంధ్రావాలా) పాటలకి ఆది ఎలా డ్యాన్స్‌ చేశాడో మీరూ చూసేయండి..!




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని