vijay antony: ‘బిచ్చగాడు’ సీక్వెల్‌.. మురుగదాస్‌ సర్‌ప్రైజ్‌ - telugu news ace director ar murugadoss will announce bitchagadu movie director
close
Updated : 23/07/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

vijay antony: ‘బిచ్చగాడు’ సీక్వెల్‌.. మురుగదాస్‌ సర్‌ప్రైజ్‌

చెన్నై: తెలుగునాట ఎవరూ ఊహించని విజయం అందుకున్న తమిళ చిత్రం ‘బిచ్చగాడు’. విజయ్‌ ఆంటోనీ హీరోగా దర్శకుడు శశి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమైంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ కథ ఎంతోమందిని కదిలించింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరో చిత్రం రాబోతుంది. ‘బిచ్చగాడు 2’ పేరుతో రానున్న ఈ సినిమా దర్శకుడి వివరాల్ని ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ జులై 24 ఉదయం 11గంటలకు తెలియజేయనున్నారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మిస్తుంది. మరి ఆ దర్శకుడు ఎవరో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. విజయ్‌ ఆంటోనీనే ‘బిచ్చగాడు’ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులోని పాటలూ విశేషంగా అలరించాయి. ఈ సినిమా విజయంతో విజయ్‌ ఆంటోనీకి టాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగింది.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని