Cinema News: అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే పాట విన్నారా..! - telugu news achamainatelugu inti pillave lyrical out now
close
Published : 03/09/2021 12:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే పాట విన్నారా..!

హైదరాబాద్‌: సీనియర్‌ నటి శ్రీలక్ష్మి, ‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సావిత్రి w/o సత్యమూర్తి’. చైతన్య కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అరవై ఏళ్ల మహిళకు.. పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే భర్త ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘అచ్చమైన తెలుగు ఇంటి అమ్మాయివే’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. సత్య కశ్యప్‌ సంగీతం అందించగా సాయి చరణ్‌ ఈపాటను ఆలపించారు. మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని