ATFPG: సినిమా విడుదలపై హక్కు నిర్మాతదే: ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ - telugu news active telugu film producers guild about tsfta
close
Updated : 23/08/2021 22:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ATFPG: సినిమా విడుదలపై హక్కు నిర్మాతదే: ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌

హైదరాబాద్‌: ‘తాము నిర్మించిన చిత్రాల్ని ఎప్పుడైనా ఎక్కడైనా విడుదల చేసుకునే హక్కు నిర్మాతకి ఉంది’ అని యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ (ఎ.టి.ఎఫ్‌.పి.జి) తెలిపింది. తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ( టి.ఎస్‌.ఎఫ్‌.ఎటి.ఎ) ఈ నెల 20న సమావేశమైన సంగతి తెలిసిందే. కొన్ని పెద్ద చిత్రాలు సైతం ఓటీటీ బాట పడుతుండటంతో.. అక్టోబరు వరకూ వేచి చూడాలని, అప్పటికీ పరిస్థితులు ఇలానే ఉంటే అప్పుడే డిజిటల్‌ మాధ్యమంలో విడుదల చేసుకోవాలని నిర్మాతల్ని కోరింది థియేటర్స్‌ అసోసియేషన్‌. ఒకవేళ అలా చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ఘూటుగా వ్యాఖ్యానించింది. ఈ విషయంపై ఎ.టి.ఎఫ్‌.పి.జి. స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటనని విడుదల చేసింది. ‘టి.ఎస్‌.ఎఫ్‌.టి.ఎ. సమావేశంలో రకరకాల వాదనలు వినిపించాయి. వాటిని ఎ.టి.ఎఫ్‌.పి.జి. తీవ్రంగా ఖండిస్తోంది. నిర్మాత వల్లే ఏ సినిమా అయినా ప్రారంభమవుతుంది. నిర్మాతలతోపాటు నటులు, సాంకేతిక బృందం కలిస్తేనే ఓ ఓ చిత్రం రూపుదిద్దుకుంటుంది. థియేటర్లని లక్ష్యం చేసుకునే సినిమాల్ని నిర్మిస్తాం. శాటిలైట్‌, వివిధ డిజిటల్‌ వేదికల రాకతో పరిస్థితి మారింది. అందుకే నిర్మాత వీటి మీదా ఆధారపడాల్సి వస్తుంది. తన చిత్రాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా విడుదల చేసుకునే హక్కు నిర్మాతకి ఉంది. వ్యక్తిగతంగా నిర్మాత, నటులని టార్గెట్‌ చేయడం భావ్యం కాదు. ప్రస్తుతం ఎగ్జిబిటర్లు భారీ బడ్జెట్‌ చిత్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. మధ్యతరహా, తక్కువ బడ్జెట్‌ చిత్రాలపై ఆసక్తి చూపించడం లేదు. చిత్ర పరిశ్రమల అంటే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒకరిపై ఒకరు ఆధారపడటం. కరోనా కారణంగా మనమంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సమస్యలపై సామసర్యంగా చర్చించుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమని మరింత అభివృద్ధిలో పథంలో నడిపేందుకు కలిసి పనిచేద్దాం’ అని పేర్కొంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని