MAA Elections: సీసీ ఫుటేజ్‌ కోరిన ప్రకాశ్‌రాజ్‌.. ఎన్నికల అధికారికి లేఖ - telugu news actor prakash raj request to maa election officer
close
Updated : 14/10/2021 17:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: సీసీ ఫుటేజ్‌ కోరిన ప్రకాశ్‌రాజ్‌.. ఎన్నికల అధికారికి లేఖ

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ని ప్రకాశ్‌రాజ్‌ కోరారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. ‘మా ఎన్నికలు నిర్వహించిన రోజు ఎన్నో భయంకర ఘటనలు జరిగాయి. దానికి మీరే సాక్షి. మోహన్‌ బాబు, నరేశ్‌ ప్రవర్తన ఎలా ఉందో చూశాం. కొందరు ‘మా’ సభ్యులపై వారు దాడి చేశారు. దానికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ లీక్‌ అయ్యాయి. ‘మా’ సభ్యులు నిజం ఏంటో, పోలింగ్‌ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. పోలింగ్‌ సమయంలో సీసీ కెమెరాల గురించి మీరు వివరించారు. అన్నింటినీ మీరు రికార్డు చేసుంటారని భావిస్తున్నా. దాన్ని మాకు అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నా. మీరు వెంటనే స్పందించకపోతే అది డిలిట్‌ అయ్యే అవకాశాలున్నాయి’ అని పేర్కొన్నారు.

సీసీ ఫుటేజ్‌ భద్రంగానే ఉంది: కృష్ణ మోహన్

ప్రకాశ్‌రాజ్‌ రాసిన లేఖపై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ స్పందించారు. ఎన్నికలకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ భద్రంగానే ఉందని తెలిపారు. నిబంధనల ప్రకారం ఫుటేజ్‌ని ఇస్తామన్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని