Rajinikanth: ఈ అవార్డుని వారికి అంకితమిస్తున్నా: రజనీకాంత్‌ - telugu news actor rajinikanth heartfelt note after receiving dadasaheb phalke award
close
Updated : 25/10/2021 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rajinikanth: ఈ అవార్డుని వారికి అంకితమిస్తున్నా: రజనీకాంత్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనకు వచ్చిన ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డుని తన గురువు, అన్నయ్య తదితరులకి అంకితమిచ్చారు రజనీకాంత్‌. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకి రజనీకాంత్‌ చేస్తోన్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించింది. ఈ అవార్డుని స్వీకరించిన రజనీకాంత్‌ తన మనసులోని మాట పంచుకున్నారు. తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన వారందరినీ గుర్తుచేసుకున్నారు. ‘భారత ప్రభుత్వం నాకు అందించిన ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’ని నా గురువు కె. బాలచందర్‌, నా అన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్‌, నా మిత్రుడు రాజ్‌ బహుదూర్‌, నా సినిమాల నిర్మాతలు, దర్శకులు, సహ నటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు, మీడియా మిత్రులు, అభిమానులు, తమిళ ప్రజలకి అంకితమిస్తున్నా’ అని ఓ లేఖలో పేర్కొన్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని