Sundeep Kishan: ఆమె నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి - telugu news actor sundeep kishan latest interview
close
Updated : 17/09/2021 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sundeep Kishan: ఆమె నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి

మూడేళ్ల క్రితమే సిగరెట్‌ అలవాటైంది: సందీప్‌కిషన్‌

ముంబయి: విభిన్న ప్రేమకథా చిత్రాలతో అలరించిన నటుడు సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘గల్లీరౌడీ’. యూత్‌ఫుల్‌ లవ్‌, క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సందీప్‌ కిషన్‌ ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. తన జీవితంలో ఓ యువతికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉందని తెలిపారు.

‘వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌’ లాంటి సినిమా ఎప్పుడు చేస్తారు?

మళ్లీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ఎందుకు బ్రదర్. ఇంకో కొత్త కథ చూపిద్దాం

ఒత్తిడి నుంచి బయటపడటం కోసం ఏం చేస్తారు?

తమన్‌ కంపోజ్‌ చేసిన మాస్‌ సాంగ్స్ పెట్టుకుని కారులో లాంగ్‌డ్రైవ్‌కి వెళ్తా..!

నాగార్జున గురించి ఒక్కమాటలో..

కొత్త దర్శకులు, జానర్లతో తరచూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసే మార్గదర్శకులు ఆయన. ‘శివ’, ‘నిన్నేపెళ్లాడతా’, ‘అన్నమయ్య’.. ఇలా చెప్పుకొంటూ వెళితే ఆ జాబితా పెద్దగా ఉంటుంది.

యాక్టింగ్‌ కాకుండా మీరు దేనిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు?

నిజం చెప్పాలంటే పెద్దగా ఏమీ లేవు. సినిమాలు చూడడం.. ఎన్నో దేశాలు చుట్టిరావడమంటే ఆసక్తి. ప్రపంచ చరిత్ర గురించి వీడియోలు చూస్తుంటాను

ఎవరి బయోపిక్‌లో నటించాలనుకుంటున్నారు?

మరో కొత్త కోణంలో మళ్లీ జార్జిరెడ్డి బయోపిక్‌ చేయాలని ఉంది. ఇటీవల విడుదలైన ‘జార్జిరెడ్డి’ బయోపిక్‌ నాకు బాగా నచ్చింది.

సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం ఎలా ఉంది?

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోంది. మంచి మనస్సున్న గొప్ప మనిషి ఆయన. త్వరలోనే ఆరోగ్య వంతుడిగా తిరిగివస్తారు.

మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరు?

నా సోదరి మౌనిక. గత కొన్నేళ్లుగా తనతో నా అనుబంధం మరింత బలపడింది. సోదరుడిగా నా బాధ్యతలేమిటో ఇటీవలే తెలిశాయి.

ఒకవేళ మీరు ఫేమస్‌ కాకపోయి ఉండి ఉంటే ఏం చేసేవాళ్లు?

ఫేమస్‌ కావడం కోసం కష్టపడేవాడిని.

మీకు సిగరెట్టు కాల్చే అలవాటు ఉందా?

దురదృష్టవశాత్తు ఉంది. మూడేళ్ల క్రితమే అలవాటు అయ్యింది. త్వరలో మానేస్తా.

రవితేజ గురించి..?

రవితేజ నాకెంతో ఇష్టమైన నటుడు. ఆయన సినిమాల్లో నేను ఎంతో ఇష్టపడే ‘వెంకీ’ కథ లాగే నా సినిమా ‘గల్లీరౌడీ’ ఉంటుంది.

స్కూల్‌ డేస్‌లో ఉన్నప్పుడు మీరు ఏం కావాలని కలలు కన్నారు?

ఐపీఎస్‌ కావాలనుకున్నా.

క్రేజీ ఫ్యాన్‌ మూమెంట్స్ గురించి చెప్పండి..?

శ్రీను, వాసు.. నన్ను ఎంతగానో ఆదరించే అభిమానులు. నటుడిగా నా కెరీర్‌ ప్రారంభమైన కొత్తలో వాళ్లు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు కన్నీళ్లు వచ్చేశాయి. శ్రీనును ఎప్పటికీ మిస్‌ అవుతాను. ఇక, వాసు.. ప్రస్తుతం యూఎస్‌లో వర్క్‌ చేస్తున్నాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని