Samantha: పేరు మార్చుకున్న సమంత.. ఆఖరికి ఇది కూడా చర్చేనా! - telugu news actress samantha changed her name in social media accounts
close
Updated : 31/07/2021 13:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samantha: పేరు మార్చుకున్న సమంత.. ఆఖరికి ఇది కూడా చర్చేనా!

హైదరాబాద్: అగ్రకథానాయిక సమంత పేరు మార్చుకున్నారు. అయితే అది నిజ జీవితంలో కాదు. ‘ఏమాయ చేసావే’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సామ్‌.. పలు సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ వేదికగా తరచూ అభిమానులకు చేరువగా ఉంటారనే విషయం అందిరికీ తెలిసిందే. Samantharuthuprabhu అనే తన పూర్తి పేరుతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలు ప్రారంభించిన ఆమె అక్కినేని వారసుడు నాగచైతన్యతో ఏడడుగులు వేసిన అనంతరం Samantha Akkineniగా ఆయా ఫ్లాట్‌ఫామ్స్‌లో పేరు మార్చుకున్నారు. సామ్‌ చేసిన పనికి అప్పట్లో అందరూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా తన సోషల్‌మీడియా ఖాతాల్లో పేరు మార్చేసుకున్నారు. కేవలం ‘S’ అని మాత్రమే పెట్టుకున్నారు. దీంతో సమంత పేరు గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘సమంతకి ఏమై ఉంటుంది? ఎందుకు ఇలా పేరు మార్చుకుంది?’ అని మొదలుపెట్టి.. నాగచైతన్యతో సామ్‌కు ఉన్న అనుబంధం గురించి కూడా అనుమానాలు వ్యక్తం చేసేలా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా సామ్‌ అభిమానులు మాత్రం.. ‘తన ఇష్టప్రకారం ఆమె పేరు మార్చుకున్నప్పుడు మీకు వచ్చిన సమస్య ఏమిటి? దీనిని కూడా భూతద్దంలో చూసి చర్చ లేవనెత్తాలా?’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ నేపథ్యంలో ‘S’ అని పేరు మార్చుకున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’ సిరీస్‌తో రాజీగా ప్రేక్షకుల్ని అలరించిన సామ్‌ ప్రస్తుతం ‘శాకుంతలం’ ప్రాజెక్ట్‌ కోసం పనిచేస్తున్నారు. గుణశేఖర్‌ దర్శకుడు. శకుంతల-దుష్యంతుల రమణీయ ప్రేమకథను ఈ సినిమాలో చూపించనున్నారు. దేవ్‌ మోహన్‌ కథానాయకుడు. అల్లు అర్జున్‌ కుమార్తె అల్లు అర్హ ఈ సినిమాలో భరతుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని