Shakeela: ఎవరో పెట్టిన పోస్టు వల్ల నాకు ఫోన్లు వస్తున్నాయ్‌..! - telugu news actress shakeela rubbishes rumours of death
close
Published : 01/08/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shakeela: ఎవరో పెట్టిన పోస్టు వల్ల నాకు ఫోన్లు వస్తున్నాయ్‌..!

చెన్నై: ఎవరో పెట్టిన పోస్టు వల్ల చాలామంది నుంచి తనకి వరుసగా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని అంటున్నారు నటి షకీలా. నటి షకీలా కన్నుమూసిందంటూ గత కొన్నిరోజుల నుంచి నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అనారోగ్య సమస్యలతో ఆమె తుదిశ్వాస విడించిందని పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై నటి షకీలా తాజాగా స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. ‘నేను మృతిచెందానంటూ పలు సోషల్‌మీడియా ఖాతాల్లో వస్తోన్న పోస్టులు చూశాను. అవన్నీ పుకార్లు మాత్రమే. నేను ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. ఎవరో ఇలాంటి పుకార్లు సృష్టించడం వల్ల నాకు వరుసపెట్టి ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు వస్తున్నాయి. నా క్షేమసమాచారాలు అడిగి తెలుసుకుంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు’ అని షకీలా పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని