ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అదిరే అభి చిత్రం - telugu news adire abhi movie white paper selected for indian book of records
close
Published : 25/09/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అదిరే అభి చిత్రం

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు ‘అదిరే’ అభి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘వైట్‌ పేపర్‌’. శివ దర్శకుడు. జి.ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌ పతాకంపై గ్రంథి శివ కుమార్ నిర్మిస్తున్నారు. నేడు అభి పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ పోస్టర్‌ని ప్రముఖ గాయకుడు మనో, నటులు అనసూయ, ఇంద్రజ విడుదల చేసి, చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అభి మాట్లాడుతూ ‘దర్శకుడు కథ చెప్పగానే సినిమా చేయాలనే ఆసక్తి మొదలైంది. 9 గంటల 51 నిమిషాల్లోనే సినిమా షూటింగ్ పూర్తిచేయాలన్న ఆయన డెడికేషన్‌ నచ్చింది. అనుకున్నట్టుగానే నిర్ణీత సమయంలో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. అలా విడుదలకి ముందే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ సినిమా చోటు దక్కించుకుంది. ఈ అవార్డు రావటం, మనో, ఇంద్రజ, అనసూయ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ‘సస్పెన్స్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. అభి నటించకపోతే ఈ సినిమా ఉండేది కాదు. అవార్డూ వచ్చేది కాదేమో! సినిమాని ఒక్క రోజులో ఎలా తీయగలవు? అని చాలామంది అన్నారు. అభి ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది’ అని అన్నారు దర్శకుడు శివ. వాణి, తల్లాడ సాయి కృష్ణ, నేహా, నంద కిషోర్ తదితరులు నటించిన ఈ సినిమాకి ఛాయాగ్రహణం: మురళీ కృష్ణ, కూర్పు: కేసీబీ హరి, సంగీతం: నవనీత్ చారి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని