Stand Up Rahul: అలరిస్తోన్న ‘అలా ఇలా అనాలని’ గీతం - telugu news ala ila song from raj tarun upcoming film stand up rahul
close
Published : 31/07/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stand Up Rahul: అలరిస్తోన్న ‘అలా ఇలా అనాలని’ గీతం

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజ్‌ తరుణ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. కూర్చుంది చాలు అనేది ఉప శీర్షిక. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయిక వర్ష పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘అలా ఇలా అనాలని’ అనే పాట (లిరికల్‌ వీడియో)ని సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు యువ నటుడు విజయ్‌ దేవరకొండ. అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ మెలొడీ అన్ని వర్గాల శ్రోతల్ని అలరిస్తోంది. సత్య యామిని, స్వీకర్‌ అగస్తి గానం వినసొంపుగా ఉంది. ఈ గీతానికి స్వీకర్‌ అగస్తినే స్వరాలు సమకూర్చారు. రాజ్‌ తరుణ్‌- వర్ష జోడీ కనువిందు చేస్తోంది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. రాజ్‌ తరుణ్‌ ఈ సినిమాలో స్టాండప్‌ కమెడియన్‌గా కనిపించనున్నాడు. వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌ విశేషంగా అలరించింది. ఈ చిత్రాన్ని డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్‌, హైఫై పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని