Ali Home Tour: నటుడు అలీ ఇంటిని చూశారా? ప్రతి ఫొటో వెనుక ఒక కథ! - telugu news ali home tour
close
Published : 26/09/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ali Home Tour: నటుడు అలీ ఇంటిని చూశారా? ప్రతి ఫొటో వెనుక ఒక కథ!

హైదరాబాద్‌: జీవితంలో ఒక్కసారైనా సినీతారలను నేరుగా చూడాలని, వారితో ఫొటో దిగాలని చాలా మంది అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. అలా దిగిన ఫొటోలను అపురూపంగా భద్రపరుచుకుంటారు. కొందరైతే ఫొటో కట్టి ఇంట్లో అందరికీ కనపడేలా పెడతారు. మరి గ్లామర్‌ ఇండస్ట్రీలో ఉంటున్న సినీ తారల ఇళ్లు ఎలా ఉంటాయి? వాళ్ల ఇంట్లో ఎంత ఖరీదైన వస్తువులు ఉంటాయి? వాళ్లు దాచుకునే అపురూప జ్ఞాపకాలు ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ మెదులుతాయి. ఒకప్పుడు సినీతారల ఇంటి బయట నుంచి చూసి చాలా మంది తెగ సంబరపడిపోయేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. వాళ్లే తమ ఇల్లు, అందులో వాళ్లు దాచుకున్న మధుర జ్ఞాపకాలు, అవార్డులు ఇలా అనే విషయాలను ‘హోంటూర్‌’పేరుతో అభిమానులతో పంచుకుంటున్నారు.

బాలనటుడు, కమెడియన్‌, హీరో, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, వ్యాఖ్యాతగా ఇలా వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన నటుడు అలీ. తెరపై ఆయన కనిపిస్తే చాలు నవ్వుల పువ్వులు పూస్తాయి. అలాంటి అలీ తన ఇంటిని ప్రేక్షకులకు చూపించారు. ఆయన సతీమణి జుబేదా అలీ యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా ‘అలీ హోంటూర్‌’ వీడియోను పంచుకున్నారు. తన తొలి చిత్రం ‘సీతాకోకచిలుక’ నుంచి వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలకు సంబంధించిన  విషయాలను అలీ వీడియో పంచుకున్నారు. ఏ సినిమాకు ఏ అవార్డు లభించిందో వివరించారు. అనంతరం జుబేదా అలీ కూడా ఇంటికి సంబంధించిన పలు విషయాలను షేర్‌ చేశారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని