Allu Arjun: యూవీపై అల్లు అర్జున్‌ ప్రశంసలు.. - telugu news allu arjun launched gaami title
close
Published : 22/10/2021 11:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Allu Arjun: యూవీపై అల్లు అర్జున్‌ ప్రశంసలు..

హైదరాబాద్‌: విభిన్నమైన సినీ కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ.. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా పట్ల యూవీ సంస్థకు ఉన్న ప్యాషన్‌ని ఆయన మెచ్చుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం యూవీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ‘గామి’ సినిమా టైటిల్‌ని అల్లు అర్జున్‌ విడుదల చేశారు.

విశ్వక్‌ సేన్‌, ‘కలర్‌ ఫొటో’ ఫేమ్‌ చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గామి’. కాగిత విద్యాధర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అఘోరాల నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో విశ్వక్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ‘గామి’ టైటిల్‌ వీడియోని షేర్‌ చేసిన బన్నీ.. ‘‘కొత్త కథలతో తరచూ ప్రేక్షకుల్ని అలరిస్తోన్న యూవీ క్రియేషన్స్‌కి నా హృదయపూర్వక అభినందనలు. ‘గామి’ గ్లిమ్స్ నాకెంతగానో నచ్చింది. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు. ఈ సినిమాలో చాలామంది నూతన నటీనటులే. పరిశ్రమలోకి కొత్తతరం దర్శకులు రావడం ఆనందంగా ఉంది’’ అని అల్లు అర్జున్‌ అన్నారు.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని