Allu Arjun: ఎఫ్‌-3 సెట్‌లోకి ఐకాన్‌స్టార్‌ సడెన్‌ ఎంట్రీ - telugu news alluarjun visited f3 sets
close
Published : 06/10/2021 14:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Allu Arjun: ఎఫ్‌-3 సెట్‌లోకి ఐకాన్‌స్టార్‌ సడెన్‌ ఎంట్రీ

హైదరాబాద్‌: విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌-3’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా సెట్‌లోకి ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ సడెన్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాకతో సెట్‌ మొత్తం ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. వెంకీ, వరుణ్‌లతో బన్నీ సరదాగా ముచ్చటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఎఫ్‌-3’ టీమ్‌ కొన్ని ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది.

బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ‘ఎఫ్‌-2’ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. అనిల్‌ రావిపూడి దర్శకుడు. వెంకీ, వరుణ్‌లకు జోడీగా తమన్నా, మెహరీన్‌ సందడి చేయనున్నారు. సునీల్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.


Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని