Green India Challenge: నాగ చైతన్యతో కలిసి మొక్కలు నాటిన ఆమిర్‌ఖాన్‌ - telugu news amirkhan and nagachaitanya parcipated in greenindia challenge
close
Published : 19/09/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Green India Challenge: నాగ చైతన్యతో కలిసి మొక్కలు నాటిన ఆమిర్‌ఖాన్‌

హైదరాబాద్‌: ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్‌ నటుడు నాగ చైతన్యతో కలిసి బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమీర్‌ఖాన్‌ బేగంపేట విమానాశ్రయంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, భావి తరాలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సంతోష్‌ కుమార్‌ని ప్రశంసించారు. మొక్కలునాటడాన్ని ఓ కార్యక్రమంలా కాకుండా బాధ్యతగా స్వీకరించారని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్‌... ఆమిర్‌ఖాన్‌, నాగ చైతన్యతో సెల్ఫీ తీసుకుంటూ సందడి చేశారు. హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’ కోసం ఆమిర్‌- నాగ చైతన్య కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకుడు. 

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని