F3: ‘ఎఫ్‌ 3’లో మరో అందం.. ఎవరంటే? - telugu news another actress got the chance in f 3 movie directed by anil ravipudi
close
Published : 21/10/2021 20:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

F3: ‘ఎఫ్‌ 3’లో మరో అందం.. ఎవరంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఎఫ్‌ 3’ చిత్రంలో మరో అందాల భామ మెరవనుంది. ఓ కీలక పాత్ర కోసం ఆమెని ఎంపిక చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇదే కాంబినేషన్‌లో రూపొందిన ‘ఎఫ్‌ 2’ ప్రేక్షకుల్ని ఎంతగా నవ్వించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. అంతకుమించిన ‘ఫన్‌’ పంచేందుకు ‘ఎఫ్‌ 3’ సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు సునీల్‌ రాకతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు మరో నాయిక తోడవ్వడంతో అవి రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. ఇంతకీ ఆ భామ ఎవరనుకుంటున్నారు? ‘పండగ చేస్కో’, ‘డిక్టేటర్‌’, ‘రూలర్‌’ తదితర చిత్రాల్లో సందడి చేసిన సోనాల్‌ చౌహాన్‌. 


Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని