Arrdham: ‘అర్థం’.. మోషన్‌ పోస్టర్‌ అదిరింది!  - telugu news arrdham motion poster mahendran
close
Published : 18/10/2021 22:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Arrdham: ‘అర్థం’.. మోషన్‌ పోస్టర్‌ అదిరింది! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దేవి’, ‘పెదరాయుడు’ తదితర చిత్రాల్లో బాలనటుడిగా మంచి గుర్తింపు పొందిన మహేంద్రన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అర్థం’. శ్రద్ధాదాస్‌, అజయ్‌, ఆమని, సాహితి అవంచ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పలు చిత్రాలకి ఎడిటర్‌గా పనిచేసిన మణికాంత్‌ తెల్లగూటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని ‘రిపబ్లిక్‌’ చిత్ర దర్శకుడు దేవ కట్టా విడుదల చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పోస్టర్‌లో మహేంద్రన్‌ తుపాకీ పట్టుకుని సీరియస్‌గా కనిపించాడు. ఈ చిత్రం సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతోంది. రిత్విక్ వెత్సా సమర్పణలో మినర్వా పిక్చర్స్, శ్రీ వాసవి మూవీ ప్రొడక్షన్స్ పతాకాలపై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ‘గ్రాఫిక్స్‌కి అధిక ప్రాధాన్యం ఉంటుంది’ అని చిత్ర బృందం తెలియజేసింది. మరి ఈ ‘అర్థం’ కథేంటి? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని