మణిశర్మ స్వరాలకి కీరవాణి గానం - telugu news balamevvadu title song manisharma mm keeravani
close
Published : 31/07/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మణిశర్మ స్వరాలకి కీరవాణి గానం

ఇంటర్నెట్‌ డెస్క్‌: మణిశర్మ, ఎం.ఎం. కీరవాణి.. ఇద్దరూ ఇద్దరే. తమ తమ బాణీలతో శ్రోతల్ని ఉర్రూతలూగిస్తారు. అలాంటి ఈ ఇద్దరూ ఓ పాట కోసం కలిశారు. ‘బలమెవ్వడు’ అంటూ అలరించారు. ధ్రువన్‌, నియా త్రిపాఠి, సుహాసిని, నాజర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘బలమెవ్వడు’ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. టైటిల్‌ ట్రాక్‌ని కీరవాణి ఆలపించారు. తాజాగా ఈ గీతం విడుదలై, విశేషంగా అలరిస్తుంది. భావోద్వేగంతో సాగే పాట ఇది. మణిశర్మ స్వరాలకి కీరవాణి గానం తోడై అద్భుతంగా నిలుస్తుంది ఈ పాట.  సినిమాలోని కొన్ని సన్నివేశాలు, కీరవాణి పాడుతున్న దృశ్యాలతో రూపొందించిన ఈ లిరికల్‌ వీడియో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని సత్య రాచకొండ తెరకెక్కిస్తున్నారు. ఆర్బీ మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని