‘బతుకు బస్టాండ్‌’ ట్రైలర్‌.. ‘ఆకాశ వీధుల్లో’ టీజర్‌ - telugu news bathuku busstand trailer and akasa veedhullo teaser
close
Published : 23/07/2021 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బతుకు బస్టాండ్‌’ ట్రైలర్‌.. ‘ఆకాశ వీధుల్లో’ టీజర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: విరన్‌ ముత్తంశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బతుకు బస్టాండ్‌’. నిఖిత అరోరా నాయిక. ఐ.ఎన్‌. రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకుడు పరశురామ్‌ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. యాక్షన్‌, లవ్‌ నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్‌ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌ చివరిలో  ‘నా చావుకి కారణం మా అమ్మానాన్న’ అని హీరో ఓ లేఖ రాస్తుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఐ.కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహవీర్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


రాక్‌స్టార్‌ కథ.. ఆకాశ వీధుల్లో

స్వీయ దర్శకత్వంలో గౌతమ్‌ కృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. పూజిత పొన్నాడ నాయిక. తాజాగా విడుదలైన టీజర్‌ అలరిస్తుంది. ఇందులో అన్ని రకాల దురలవాట్లు ఉన్న రాక్‌ స్టార్‌గా కనిపించాడు కథానాయకుడు. రాక్‌స్టార్‌ సిద్ధుగా గౌతమ్‌ లుక్స్‌ ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ రాక్‌స్టార్‌ కథేంటి? అతడు చేసిన పనుల గురించి అందరికీ తెలిసినా ఎందుకు అభిమానిస్తుంటారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మనోజ్‌ జె.డి., డా. జె. మణికంఠ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జుదా సాండీ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని