Bigg Boss Telugu 5: ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో పెళ్లిసందడి.. ప్రియ కంటతడి - telugu news bigboss telugu 5 latest promo
close
Published : 21/09/2021 20:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో పెళ్లిసందడి.. ప్రియ కంటతడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. నాగార్జున వ్యాఖ్యాతగా ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ ప్రసారమవుతోంది. మూడోవారానికి సంబంధించి నామినేషన్స్‌ ప్రక్రియ సోమవారం అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. ప్రియ చేసిన వ్యాఖ్యల కారణంగా హౌస్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. రవి తనని ఏదో అన్నాడని ప్రియ బాధపడింది. ‘నేను చూసింది, విన్నదే మాట్లాడాను. నేనేదీ కల్పించి మాట్లాడలేదు. నువ్వు ఎలా అయితే నన్ను పెంచావో నేను అలానే ఉన్నా అమ్మా’ అంటూ కంటతడి పెట్టుకుంది. నేడు ప్రసారంకానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో చెప్పిన సంగతులివి.

మరోవైపు.. పెళ్లి నేపథ్యంలో ‘హైదరాబాద్‌ అమ్మాయి- అమెరికా అబ్బాయి’ అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా హైదరాబాద్‌ అమ్మాయిగా లహరి, అమ్మాయి మామయ్యగా రవి, అమెరికా నుంచి తిగిరివచ్చిన అబ్బాయిగా శ్రీరామ్‌, ఈ అబ్బాయి మాజీ గాళ్‌ ఫ్రెండ్‌గా హమీదా, పెళ్లి సంబంధాలు కుదిర్చే వ్యక్తిగా షణ్ముఖ్‌ సందడి చేయనున్నారు. ఈ హంగామా అంతా చూడాలంటే కొన్ని క్షణాలు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమోలు చూసి ఆనందించండి..




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని