Bigg Boss Telugu 5: ఫేక్‌ పీపుల్‌తో ఆడలేను.. శ్వేత నా వల్ల వెళ్లిపోయిందా? - telugu news biggboss telugu 5 latest promo
close
Updated : 18/10/2021 18:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: ఫేక్‌ పీపుల్‌తో ఆడలేను.. శ్వేత నా వల్ల వెళ్లిపోయిందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: నామినేషన్ల ప్రక్రియతో ‘బిగ్‌బాస్‌’ హౌస్‌ వేడెక్కుతోంది. ఆరో వారంలో నామినేషన్లు చాలా విభిన్నంగా సాగుతున్నాయి. ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కార్యక్రమం ఇది. సోమవారం ప్రసారంకానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆ విశేషాలివీ.. ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ ఎప్పుడూ జరగని విధంగా జరుగుతుందని రవి చెప్పిన మాటతో ప్రోమో ప్రారంభమైంది. ఓ టేబుల్‌పై ఉన్న అరటిపండ్లని ఎవరైతే తీసుకుంటారో.. వారికి నామినేట్‌ చేసే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌లో షణ్ముఖ్‌, సిరి, కాజల్‌ గెలిచారు. అలా యానీ మాస్టర్‌ని షణ్ముఖ్‌ నామినేట్‌ చేయగా సిరి.. మానస్‌ని నామినేట్‌ చేసింది. ‘సారీ చెప్పారు. కానీ నేను దాన్ని అంగీకరించలేకపోతున్నా’ అని తెలియజేసింది. ఆ తర్వాత కాజల్‌.. ప్రియని నామినేట్‌ చేసింది. మరోవైపు, సన్నీ, శ్రీరామ చంద్ర, జశ్వంత్ వేటగాళ్లుగా సందడి చేశారు. ఓ సందర్భంలో ‘అందరూ సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారు’ అని ప్రియాంక ఫైర్‌ అయింది. ‘ఆరు వారాల నుంచి చదువుతున్నారా’ అని రవి అనగానే ‘నాకు నచ్చింది నేను చేస్తా, నేను హంటర్‌ని’ అంటూ సన్నీ సమాధానమిచ్చాడు. మరి ఏ కారణంతో సిరి, షణ్ముఖ్‌, కాజల్‌ నామినేట్‌ చేశారు? రవి- సన్నీ మధ్య ఇంకా ఏం జరిగింది? తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని