Sri Simha: సెట్‌లో మెమొరీకార్డ్‌ తస్కరించిన శ్రీసింహా - telugu news camera memorycard robbed by srisimha
close
Updated : 18/09/2021 15:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sri Simha: సెట్‌లో మెమొరీకార్డ్‌ తస్కరించిన శ్రీసింహా

హైదరాబాద్‌: ‘మత్తువదలరా’ చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమ్యారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్నకుమారుడు శ్రీసింహా. తొలి ప్రయత్నంతోనే నటుడిగా మంచి మార్కులు అందుకున్న ఆయన ప్రస్తుతం ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాలో నటిస్తున్నారు. సతీష్‌ త్రిపుర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ సరదా వీడియో షేర్‌ చేసింది. తన ప్రాణ స్నేహితుడి పెళ్లి కారణంగా ఒక్కరోజు సెలవుకి పరిష్మన్‌ ఇవ్వాలని శ్రీసింహా తన దర్శకుడ్ని కోరగా.. ‘ఇవ్వడం కుదరదు ఎందుకంటే ఆల్‌ ఆర్టిస్ట్స్‌ కాంబినేషన్ సీన్లు ఉన్నాయి‌’ అని సమాధానమిస్తారు.

ఆ మాటకు శ్రీసింహా ‘ఒక్క రెండు గంటలైన ఇవ్వండి.. అలా వెళ్లి.. వాళ్లకి కనిపించి వచ్చేస్తా’ అని అడగ్గా.. ‘నో.. కావాలంటే జూమ్‌ కాల్‌లో విషెస్‌ చేయండి’ అని చెబుతాడు. దాంతో చేసేది ఏమీలేక షూట్‌ ప్రారంభించండి లొకేషన్‌లో అడుగుపెట్టేస్తా అంటూ శ్రీసింహా అక్కడే ఉన్న కెమెరా మెమొరీ కార్డు దొంగిలిస్తాడు. షూటింగ్‌ ప్రారంభం కాగానే.. అందరూ మెమొరీ కార్డు కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే కొన్ని గంటలపాటు చిత్రీకరణ వాయిదా వేస్తున్నామని దర్శకుడు చెప్పడంతో.. ‘సరే సర్.. నేను నా పనులు చూసుకువస్తా.. అయినా డైరెక్టర్‌ గారూ.. దొంగలున్నారు జాగ్రత్త’ అంటూ శ్రీ సింహా సమాధానమివ్వడం ఆకట్టుకునేలా ఉంది. సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ బ్యానర్‌పై ఈసినిమా నిర్మితమవుతోంది. సముద్రఖని కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని