Chiranjeevi: దివ్యాంగ అభిమాని పాదయాత్ర.. చలించిపోయిన చిరంజీవి - telugu news chiranjeevi met his fan
close
Published : 27/10/2021 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: దివ్యాంగ అభిమాని పాదయాత్ర.. చలించిపోయిన చిరంజీవి

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన డెక్కల గంగాధర్‌. చిరంజీవి నటించిన ‘మాస్టర్‌’ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిరంజీవిని కలిసేందుకు అక్టోబరు 3న ఆయన పాదయాత్ర చేపట్టారు. అమలాపురంలో ప్రారంభమైందీ యాత్ర. అలా గంగాధర్‌ కాలినడకన (సుమారు 726 కి.మీ.) హైదరాబాద్‌లోని ‘చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు’ చేరుకున్నారు.

ఈ విషయం తెలుసుకుని చలించిపోయిన చిరంజీవి వెంటనే గంగాధర్‌ని తన ఇంటికి తీసుకెళ్లి, కాసేపు ముచ్చటించారు. గంగాధర్‌ దివ్యాంగుడు కావడంతో ‘ఇలాంటి సాహసాలు ఎప్పుడూ చేయొద్దు’ అని కోరారు. అనంతరం, గంగాధర్‌ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ నేపథ్యం తదితర విషయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ‘నా స్వగ్రామం ఉప్పలగుప్తం మండలంలోని కిత్తనచెరువు. చిరంజీవిగారంటే ఎంతో అభిమానం. అందుకే ఇన్ని వందల కిలోమీటర్లు నడిచివచ్చాను. ఆయన నుంచి ఏం ఆశించిరాలేదు. ఆయన్ను కలిస్తే చాలు అనుకుని వచ్చా. చిరంజీవి ఇచ్చిన ధైర్యం, ఆతిథ్యం మరిచిపోలేను. ఈ జీవితానికి ఇది చాలు’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు గంగాధర్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని